
నవతెలంగాణ – చండూరు : చండూరు మండల పరిధిలోని తుమ్మలపల్లి గ్రామంలో గల శ్రీ రామలింగేశ్వర స్వామి (జాతర) బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం విమాన రథోత్సవ ఘనంగా నిర్వహించారు. కార్ ఈ సందర్భంగా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు స్వాగతం పలికారు. అనంతరం రామలింగేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.వేదమంత్రాల మధ్య స్వామివారి రథాన్ని అనే ప్రారంభించి ముందు వెనుకకు లాగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ ప్రాంతం అంతా పచ్చని పంటలతో, సిరిసంపదలతో,పిల్లాపాపలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, అందరూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని స్వామివారిని వేడుకొండానని అన్నారు. మీకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు రామలింగేశ్వర స్వామి కృపకు పాత్రుడనై ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్, సభ్యులు, వంశపార్యపర్య అర్చకులు, స్థానిక నాయకులు, తదితరులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కొరిమి ఓంకారం, కోడి శ్రీనివాసులు, అనంత చంద్రశేఖర్ గౌడ్, కోడి గిరిబాబు, పల్లె వెంకన్న,నల్లగంటి మల్లేష్,గండూరి జనార్ధన్, బూతారాజు ఆంజనేయులు, దేవాలయ కమిటీ చైర్మన్ గుండ్రెడ్డి రమ్య రామలింగారెడ్డి, ఆలయ కార్య నిర్వహణ అధికారి అంబటి నాగిరెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు కురుపాటి వెంకటమ్మ, బోయపల్లి రాములు గౌడ్, జిల్లా నరసింహ, కారువంగ నరసింహ శర్మ, భక్తులు తదితరులు పాల్గొన్నారు.