Tuesday, March 24, 2026
E-PAPER
Homeకరీంనగర్వడగండ్లు.. కడగండ్లు

వడగండ్లు.. కడగండ్లు

- Advertisement -

నవతెలంగాణ – చందుర్తి
మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం కురిసిన వడగండ్ల వర్షంతో అన్నదాతకు నష్టం వాటిల్లింది. మండలంలోని ఆశిరెడ్డిపల్లి, తిమ్మాపూర్, రామన్నపేట గ్రామాల్లో వడగండ్లు కురవడంతో పొట్టకు వచ్చిన పొలాలు దెబ్బతిన్నాయి. వారం రోజుల్లో కోతకు వచ్చిన వరి మళ్లలో రాళ్లు పడడం తో దాదాపుగా 50 శాతం వడ్లు రాలిపోయినట్లుగా రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.

తిమ్మాపూర్ కు చెందిన గాలిపెళ్లి దేవయ్య, గడి కొప్పుల రాజేశం, ఆశిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కొలిపాక ప్రభాకర్ రెడ్డి, ఈసరి రవి అనే రైతులకు చెందిన 24 ఎకరాల వరకు నష్టం వాటిల్లినట్లుగా ఆవేదన వ్యక్తం చేశారు. దీంతోపాటు గా పలు గ్రామాల్లో వడగండ్లతో 100 ఎకరాల వరకు పంట దెబ్బతిన్నది రైతుల ద్వారా తెలిసింది. దీని పై వ్యవసాయ అధికారి దుర్గ రాజును వివరణ కోరగా వడగండ్ల వర్షం పడింది వాస్తవమే ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక పంపిస్తామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -