హనుమాన్ జయంతినీ పురస్కరించుకొని అన్నదానం..

Food distribution on the occasion of Hanuman Jayanti..నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం వీరన్న గుట్ట గ్రామంలో శనివారం హనుమాన్ జయంతి వేడుకలను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఉదయం నాలుగు గంటల నుంచి హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులందరికీ అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు. ఉదయం 8 గంటల నుంచి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతో పాటు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Spread the love