
గాంధారి మండల కేంద్రంతోపాటు మండలంలోని అన్ని గ్రామాల్లో అన్ని తండాల్లో హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఆలయాలను అలంకరణ చేశారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చందన పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు ప్రజలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.