నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ ప్రత్యేక పోలీస్ 7వ బెటాలియన్ డిచ్ పల్లి ఆవరణలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్న హనుమాన్ ఆలయం లో కమాండెంట్ దంపతులు భవాని- సత్యనారాయణ ఆధ్వర్యంలో డిచ్ పల్లి, ఇందల్ వాయి మండల కేంద్రంలథో పాటు ఆయా గ్రామాల్లో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ విగ్రహానికి తమలపాకుల మాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో బెటాలియన్ అధికారులు, సిబ్బంది , శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ కమిటీ సభ్యులు,అయా గ్రామాల హనుమాన్ భక్తులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.