హనుమాన్ టెంపుల్ చైర్మన్ కు ఘన సన్మానం..

A grand tribute to the chairman of Hanuman Temple..నవతెలంగాణ – మద్నూర్

ఇటీవల మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయ కమిటీ చైర్మన్గా నియమితులైన రామ్ పటేల్ కు రాచూర్ గ్రామంలో మంగళవారం నాడు రాజు పటేల్ ఆధ్వర్యంలో గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో రాజు పటేల్, సచిన్ పటేల్, తాజా మాజీ సర్పంచ్ పార్వతి బాయి, శంకర్ పటేల్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ధరాష్ సాయిలు, హనుమాన్లు స్వామి, శ్రీనివాస్ పటేల్, హనుమంతు యాదవ్, వట్నాల రమేష్, జావిద్ పటేల్, బండి గోపి, తదితరులతోపాటు రాచూర్ గ్రామస్తులు పాల్గొన్నారు.
Spread the love