ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి

నవతెలంగాణ – రాయపర్తి
స్వతంత్ర సమరయోధుడు మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతిని శుక్రవారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షుడు జాటోత్ హమ్యా నాయక్, మండల పార్టీ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి,  తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జన్ను నర్సయ్య, దళిత రత్న అవార్డు గ్రహీత ఐత మల్లేష్, విగ్రహాల కమిటీ అధ్యక్షులు ఐత రాజు, నాయకులు మాచర్ల ప్రభాకర్, మాజీ సర్పంచ్ ఎండి ఉస్మాన్, మల్యాల నరసింహమూర్తి, కుమార్, కోతి వీరన్న సోడపు శ్రీనివాస్, కోతి కళ్యాణ్, పిరని ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love