ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం.. 

– ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె శ్రీనివాస్ రెడ్డి 
– జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రిన్సిపాల్ ఎం రవి 
నవతెలంగాణ – నెల్లికుదురు 
మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో, జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించినట్లు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే శ్రీనివాస్ రెడ్డి జడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రిన్సిపాల్ ఎం రవి తెలిపారు. శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థులచే యోగా కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని జడ్పీహెచ్ఎస్ మండల కేంద్రం పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు M రవి ,ఆంగ్ల ఉపాధ్యాయుడు G.జనార్ధన్  వివిధ రకాల ఆసనాలు వేయిస్తూ యోగ ప్రాముఖ్యతను విద్యార్థిని విద్యార్థులకు వివరించారు.ఈ కార్యక్రమంలో వెంకటరెడ్డి,భాస్కర్,సిహెచ్.శ్రీనివాస్,ధర్గయ్య,మధు,ఐలయ్య పాల్గొన్నారు. ఆదర్శ పాఠశాల, కళాశాలలో విద్యార్థులచే ఘనంగా యోగా దినోత్సవం చేయించినట్లు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆసనాలు తాడాషన్ త్రికోనా సన్ వీరభద్రసనం అర్ద గటి చక్రసన, ప్రాణాయామం లో బస్త్రిక కాపాల బాతి అగ్ని సారక క్రియ భాహ్య ప్రాణాయామం ధ్యానం చేయడం జరిగింది. ఈ ఆసనాలలో పిఇటి సోమన్న, నరేష్ సార్, బాలాజీ లు చేయించారు విరితోపాటు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
Spread the love