ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండలం కాంసానిపల్లిలో ప్రాథమిక పాఠశాల జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించడం జరిగింది. సైన్స్, మ్యాథ్స్, తెలుగు అంశాలతో కూడిన క్విజ్ పోటీలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని సమాధానాలు చెప్పడం జరిగింది. ఈ పోటీలలో గణేష్ అండ్ టీం మొదటి స్థానంలో నిలువగా శివతేజ్ టీం ద్వితీయ స్థానంలో నిలిచారు. ఈ కార్యక్రమంలో మండల నోడల్ అధికారి సమక్షంలో నిర్వహించడం జరిగింది. క్విజ్ పోటీ తర్వాత మండల నోడల్ అధికారి శ్రీ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రశ్నలకు స్పందించిన తీరు క్లిష్టమైన ప్రశ్నలకు కూడా అలవోకగా సమాధానాలు చెప్పడాన్ని మెచ్చుకున్నారు జాతీయ సైన్స్ దినోత్సవ ప్రాముఖ్యతను భారత శాస్త్రవేత్తల పరిశోధనలను వారు సాధించిన విజయాలను ప్రపంచానికి వారు అందించిన విజ్ఞానాన్ని అది మానవాళి అభివృద్ధికి తోడ్పడిన తీరును వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ విజయ్ కుమార్, ఉపాధ్యాయులు సరళ, అంబిక, ఆంజనేయులు పాల్గొన్నారు.
Spread the love