నూతన సంవత్సర వేడుకలు మండల వ్యాప్తంగా బుధవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా యువత రోడ్ల మీదకు వచ్చి, మస్త్ గా ఎంజాయ్ చేశారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, పాలకుర్తి దేవస్థానం మాజీ చైర్మన్ వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ లు కలిసి కేక్ కట్ చేసి, ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు వెంకన్న, ప్రధాన కార్యదర్శి శ్రీరాం సంజయ్ కుమార్, దుంపల దామోదర్ రెడ్డి, దుంపల సమ్మయ్య, కృష్ణమూర్తి, నిమ్మల విజయ శ్రీనివాస్, గంగాధర్, రఘు, అనపురం రవి, చిలుక బిక్షపతి, బాలు, హేమాని, వీరన్న, శ్రీను, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.