
మండల పరిధిలోని దాసిరెడ్డిగూడెం గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న 314వ వర్ధంతి సందర్భంగా పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బహుజన వీరుడు సర్వాయి పాపన్న రాచరికపు వ్యవస్థ నీడలో జమీందార్లు, జాగీర్దాల అరాచకాలను సహించలేక కత్తి పట్టిన వీరుడని, దళిత, బహుజనులు ఏకమై పోరాడితేనే రాజ్యాధికారం సాధించవచ్చని నిరూపించిన సామన్య బహుజన వీరుడు అని అన్నారు. సర్వాయి పాపన్న 361 ఏళ్ల క్రితమే గోల్కొండ కోటపై జెండా ఎగర వేశాడు అని, రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్‌ను కేంద్రంగా చేసుకొని మొఘలుల ఆధిపత్యాన్ని ఎదిరించి గోల్కొండ కోటపై జెండా ఎగురవేశాడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిక్షపతి గౌడ్,దంతురి దుర్గయ్య గౌడ్, బిజెపి భువనగిరి పార్లమెంట్ కన్వీనర్ బందారపు లింగస్వామి గౌడ్, కాటం గణేష్ గౌడ్ బాలగోని మల్లయ్య గౌడ్, దంతూరి యాదయ్య గౌడ్, గోద అచ్చయ్య గౌడ్, బాలగోని బిక్షపతి గౌడ్, దంతూరి శంకరయ్య గౌడ్, బాలగోని మధు గౌడ్, దంతూరి పరమేష్ గౌడ్, బోడిగే యాదయ్య గౌడ్, బొదిగే కృష్ణ స్వామి గౌడ్, దంతూరి నాగేష్ గౌడ్, నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.