
నారాయణ పేట జిల్లా క్రిష్ణా మండల పరిధిలోని కున్సీ గ్రామాల్లో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా గ్రామ అఖిలపక్ష ఆధ్వర్యంలో యువజనదినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామ నాయకులు నల్లె నరసప్ప, మ్యాకల్ భీమ్ మాట్లాడుతూ భారతదేశ ఖ్యాతిని, సంస్కృతీ సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పారని వక్తలు పేర్కొన్నారు. యువత చేతుల్లోనే దేశభవిష్యత ఆధారపడి ఉంటుందన్నారు, యువతీ, యువకులు అన్ని రంగాల్లో రాణిస్తూ ఆదర్శవంతంగా దేశ భవిష్యత్తు ఉంటుందని అన్నారు. గ్రామ పెద్దలు సిద్దప్ప మాస్టర్, రాంచందర్ మాస్టర్, రుద్రప్ప సౌకరి, పిట్టల చంద్రశేఖర్, బీజేపీ మండల అధ్యక్షులు శ్రీనివాసులు, నాయకులు మ్యాకలి మహాదేవ్, కాంగ్రెస్ నాయకులు నల్లె శ్రీనివాస్, మాజీ ఉపసర్పంచ్ బాలరాజ్, జెగ్గిలి హన్మంతు, నల్లె సైబన్న, పిట్టల ధర్మరాయ,జనార్దన్ గౌడ్, సుగురప్ప సౌకరి, మహాదేవప్ప, శరణగౌడ, కుర్వ రాజు,ఉప్పరి శరణప్ప, కట్ల మహాదేవ్,బుగ్గొజీ తదితరులు పాల్గొన్నారు.