ఘనంగా ప్రపంచ ఆహారం దినోత్సవం

నవతెలంగాణ – కరీంనగర్:
శ్రీ సప్తగిరి లైన్స్ క్లబ్  ఆధ్వర్యంలో సోమవారం ప్రపంచ ఆహార దినోత్సవం కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మ నగర్ లో గల  భవితవృద్ధుల ఆశ్రమంలో బ్రెడ్, పండ్లను పంపిణీ చేయడం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ సప్తగిరి లైన్స్ క్లబ్ అధ్యక్షులు గడప కోటేష్ కుమార్ సెక్రెటరీ కంటే రామచందర్ ట్రెజరర్ గునుకుల సత్యనారాయణ రెడ్డి, లైన్ మిత్రులు గడప మనోజ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Spread the love