– ఘనంగా మహా శివరాత్రి పర్వదినాన ఘనంగా శివపార్వతుల కళ్యాణం
నవతెలంగాణ – కంఠేశ్వర్
హర హర మహాదేవ శంభో శంకర ఓం నమశ్శివాయ అంటూ భక్తుల నామస్మరణతో ఆలయాలు మారుమ్రోగాయి. శివపార్వతులు భక్తుల కోసం కైలాసాన్ని వీడి భూలోకానికి వచ్చిన అపురూప రోజైనా మహాశివరాత్రి పర్వదినం భక్తి ప్రపత్తులతో వేడుకగా జరిగాయి.వేద పండితుల మంత్రోచ్ఛరణలతో శివాలయాలు మారు మ్రోగాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని నగర ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రాత: కాలం నుంచే దేవాలయాలకు భక్తుల సందడి నెలకొంది. స్వామివారికి సుప్రభాతసేవ, అభిషేకాలు, అర్చనల కోసం భక్తులు బారులు తీరారు. శివలింగానికి పంచామృత అభిషేకాలు, అర్చనలు ,నిర్వహించే భక్తులతో ఆలయాలు సందడిగా మారాయి. శివునికి పంచామృతాలతో పాటుగా చెరుకు రసం తో, కొబ్బరి బొండాల రసంతో, నల్ల ద్రాక్ష పండ్ల రసంతో అభిషేకం నిర్వహిస్తే శుభాలు కలుగుతాయని భక్తులు భావించి, శివాలయాల్లో పెద్దఎత్తున పండ్ల రసాలతో అభిషేకం నిర్వహించారు. శివారాధన, బిల్వ పత్రాలతోప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఉదయం నుంచి రాత్రి వరకు జాగరణ చేస్తూ శివనామస్మరణతో గడిపారు. శివునికి ప్రీతికరమైన నైవేద్యాలను ,భక్తితో సమర్పించారు. రాత్రి జాగరణలో భక్తి పాటలు, భజనలు పలు ఆలయాల్లో శివపార్వతుల కల్యాణాలు కన్నుల పండుగగా నిర్వహించారు.
నీలకంఠేశ్వరాలయంలో..
నీలకంఠేశ్వరాలయంలో..
ఇందూరు కంఠాభరణం అయిన నీలకంటేశ్వర ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నీలకంఠుడికి ఆలయంలో వేద పండితులు శివలింగానికి రుద్రాభిషేకం, అభిషేకం నిర్వహించారు. తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి ఆలయంలో అభిషేకాలు కొనసాగాయి. నీలకంఠేశ్వరాలయంలో ఉదయం నుండి భక్తుల అభిషేకాలు, ప్రత్యేక పూజలతో సందడి నెలకొంది .దేవాదాయ సహాయ కమిషనర్ శ్రీరామ్ రవీందర్ గుప్త పర్యవేక్షణ లో మహా శివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తాగునీరు, అరటి పండ్ల ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు సుహాస్ మకరంద్ నీలేష్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
శంభు లింగేశ్వర ఆలయంలో..
నగరంలోని శంభు లింగేశ్వర ఆలయం లో మహాశివరాత్రి సందర్భంగా ఉదయం నుండి శివునికి అభిషేకం నిర్వహించారు .మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు. ఉదయం నాలుగు గంటల నుండి శివునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్త హాజరై శివునికి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇలాంటి సేవా కార్యక్రమము ఏర్పాటు చేసినందుకు రోటరీ క్లబ్బు సభ్యులకు అభినందనలు తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా శివుని కృపా కటాక్షాలు ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు .రోటరీ క్లబ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో భక్తులకు కొబ్బరి స్వీట్, సాబుదాన ప్రసాదం పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు బిరెల్లి విజయరావు మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరం నియమనిష్ఠలతో భక్తులకు ప్రసాదాన్ని అందజేస్తాము అని తెలిపారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి గంగారెడ్డి, సుధీర్ గుప్తా, పవన్ పాండే, గోపాల్ సోని, జితేంద్ర మలాని, బాబురావు దంపతులు, పార్సి రాజేశ్వర్ దంపతులు, రామకృష్ణ, ఆకుల అశోక్, జుగల్ సోనీ దంపతులు, శ్రీరామ్ సోనీ దంపతులు, వి శ్రీనివాసరావు, జగదీశ్వరరావు , జ్ఞాన ప్రకాష్ తదితరులు సేవలో పాల్గొన్నారు. సహాయ కమిషనర్ శ్రీరాo రవీందర్ గుప్త రవీందర్ కార్యనిర్వహణాధికారి ఎస్ రాములు ఆధ్వర్యంలో శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు రాజ్ కిరణ్ రఘురాం వ్యాస్ జూనియర్ అసిస్టెంట్ డి కిషోర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
మనోకామేశ్వరాలయంలో..
నగరంలోని దేవి రోడ్డు వద్ద గల మనోకామేశ్వరాలయంలో శివరాత్రి సందర్భంగా ఆలయ అర్చకులు సురేష్ శర్మ ఆధ్వర్యంలో రుద్రాభిషేకం అభిషేకాలు నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు బారులు తీరారు స్వామివారిని దర్శించుకుని తరించారు భక్తులు పాలతో అభిషేకం నిర్వహించేలా ఏర్పాటు చేశారు.
మల్లికార్జున ఆలయంలో..
నగరంలోని కోట గల్లీలో గల మల్లికార్జున ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు శివునికి అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం యజ్ఞం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ. సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.
నగేశ్వరాలయంలో..
నగరంలోని పెద్ద బజార్ వద్ద గల నగరేశ్వర ఆలయంలో శివునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు,భక్తులు తదితరులు పాల్గొన్నారు.