హెచ్‌సీయూ వీసీని సస్పెండ్‌ చేయాలి

– ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్‌
నవతెలంగాణ-హయత్‌నగర్‌
హెచ్‌సీయూ వీసీని సస్పెండ్‌ చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు గుండె శివకుమార్‌ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రెసిడెంట్‌ మహేష్‌ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ధర్నాలో శివకుమార్‌ పాల్గొని మాట్లాడారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ఎన్నికల్లో గెలుపొందిన అధ్యక్షుడిని, తోటి నాయకులను అన్యాయంగా కుట్ర చేసి సస్పెండ్‌ చేసిన యూనివర్సిటీ వీసీని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. హయత్‌నగర్‌లో సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థులకు మద్దతుగా నిరసన వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. విద్యార్థులపై పెట్టిన సస్పెండ్లను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేని యెడల ఆందోళనలు ఉధతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు సాయికుమార్‌, సందీప్‌, అనిల్‌, రాము తదితరులు పాల్గొన్నారు.

Spread the love