సమ్మిళిత భారతదేశ నిర్మాణానికి తన నిబద్ధతను చాటి చెప్పిన హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో

అందరూ అభివృద్ధి చెందేందుకు ఆహ్వానించే, స్థలాన్ని సృష్టించే కార్యాలయాన్ని నిర్మించాలనే ప్రధాన సందేశంతో సంస్థ ‘అందరినీ ప్రేమించండి’ అనే ప్రయత్నాన్ని ప్రారంభించింది.

నవతెలంగాణ హైదరాబాద్: భారతదేశంలోని ప్రముఖ నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ‘లవ్ ఆల్’ ఇనిషియేటివ్‌ను ప్రారంభించడం ద్వారా సమ్మిళిత భారతదేశాన్ని నిర్మించడం పట్ల తన నిబద్ధతను చాటి చెప్పింది. ఒక దేశంగా ప్రతి ఒక్కరూ జాతి, భాష, ఆహారపు అలవాట్లు, సామర్థ్యాలు, ఇతర అంశాలలో సేంద్రీయంగా విభిన్నంగా ఉంటారనే స్వాభావిక అవగాహన కల్పిస్తూ, అందరికీ పని చేసే కార్యాలయాన్ని రూపొందించేందుకు కంపెనీ శ్రమిస్తోంది.

ఒక చిత్రంగా ప్రారంభించిన లవ్ ఆల్ క్యాంపెయిన్, దేశంలోని ప్రతి పౌరుడు అర్థం చేసుకునే ఒక భాషతో వైవిధ్యంగా చేసిన ప్రయత్నం అని చెప్పవచ్చు. ఇది ప్రేమకు సంబంధించిన మెటా-ఎమోషన్‌పై ఆధారపడి ఉంటుంది. ప్రేమ భావోద్వేగం ఎటువంటి స్పృహ లేదా సబ్‌కాన్షియస్ అనే పక్షపాతం లేకుండా ప్రతి ఒక్కరినీ చేర్చేందుకు ఒక స్థలాన్ని సృష్టించగలదని గుర్తించాలని ఇది ప్రజలను విజ్ఞప్తి చేస్తుంది.
హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ అనూజ్ త్యాగి ఈ ప్రయత్నాన్ని ప్రారంభించి మాట్లాడుతూ, “నేడు ఇన్‌క్లూజన్ అనేది మానవ వనరుల ఆదేశాన్ని మించిపోయింది. భవిష్యత్తులో సిద్ధంగా ఉన్న వారి స్థితిని సుస్థిరం చేసుకునే సంస్థకు ఇప్పుడు ప్రాధాన్యత ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గోలో ఇన్‌క్లూజన్ పట్ల మా నిబద్ధత మెరుగైన లింగ సమతౌల్య శ్రామికశక్తిని కలిగి ఉండటంలో స్పష్టమైన ఫలితాలను చూపింది – దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి, విభిన్న సామర్థ్యాలు కలిగిన వ్యక్తుల ప్రాతినిధ్యం కలిగి ఉన్నారు. ప్రతిభ ఆధారంగా ఆలోచనలు, సూచనలను రివార్డ్ చేసే ఒక వర్క్ ప్లేస్‌ను కూడా మేము సిద్ధం చేశఆము. గుర్తింపును దాటి ముందుకు వెళడం ద్వారా ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందడానికి ఇది ఒక కేంద్రంగా మారింది. మహిళా మోటారు సర్వేయర్‌లను నమోదు చేసుకోవడం లేదా ఒకే ఉద్యోగి నిర్వహించే కార్యాలయాలైన డిజిటల్ కార్యాలయాలలో పూర్తిగా మహిళా క్లస్టర్‌ను ఏర్పాటు చేయడం వంటి పరిశ్రమలో మొదటి ప్రయత్నం అయినా, చివరి మైలు వరకు బీమాను తీసుకువెళడాన్ని ప్రోత్సహించేందుకు, మూసపద్ధతులను విచ్ఛిన్నం చేయాలనే మా నిబద్ధతను ప్రదర్శిస్తాయి. సీలింగ్ మరియు నిజమైన అర్థంలో ఒక కలుపుకొని వెళ్లే వర్క్ ప్లేస్‌ను ప్రోత్సహిస్తున్నాము. దీనికి అనుగుణంగా మా లవ్ ఆల్ ద్వారా విభిన్నమైన కోహోర్ట్‌ల నుంచి స్వరాలను సూచించేందుకు ప్రత్యేకమైనది, సూక్ష్మభేదం కలిగి ఉంటుంది – భావి బిల్డింగ్ బ్లాక్‌లుగా సానుభూతి కోసం పిలుపునిస్తోంది’’ అని వివరించారు.  ఇన్‌క్లూజన్, సమానత్వానికి సంబంధించి తన నిబద్ధతకు అనుగుణంగా, హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో అనేక కార్యక్రమాలకు నాయకత్వం వహించింది. వాటిలో ముఖ్యమైనవి ప్రాజెక్ట్ శక్తి మరియు ప్రాజెక్ట్ పర్పుల్. ప్రాజెక్ట్ శక్తి మహిళా సహోద్యోగుల కోసం ఒక సమగ్ర కార్యాలయాన్ని సృష్టించి, వారికి సమాన అవకాశాలను కల్పించడంపై దృష్టి సారిస్తోంది. ప్రాజెక్ట్ పర్పుల్ ప్రత్యేక సామర్థ్యాలు కలిగిన వ్యక్తుల కోసం తలుపులు తెరుస్తుంది, వారి ప్రత్యేక ప్రతిభను స్వీకరించే సహాయక, సాధికారత వాతావరణాన్ని పెంపొందిస్తుంది. టీవీ, ప్రింట్, ఆన్‌లైన్‌తో సహా 360 డిగ్రీల మీడియా ప్రచారం ద్వారా లవ్ ఆల్ ప్రయత్నాన్ని ప్రారంభించారు. దృష్టి లోపం ఉన్న వ్యక్తుల కోసం కంపెనీ ఈ ఫిల్మ్ ప్రత్యేక వెర్షన్‌ను కూడా విడుదల చేసింది. వాయిస్ ఓవర్‌లు ప్రతి సందర్భాన్ని, సన్నివేశాన్ని వివరిస్తాయి. ఈ ప్రయత్నంపై ఉద్యోగులకు అవగాహన కల్పించేందుకు, కంపెనీ తన కీలక కార్యాలయాల్లో బ్రెయిలీ ఎనేబుల్ పోస్టర్‌లను ఏర్పాటు చేసింది. వైవిధ్యాన్ని చివరి మైలు వరకు చేర్చుందుకు సరైన సంభాషణ స్టార్టర్‌గా తన ఉద్యోగుల కోసం మొదటి రకమైన కార్డ్ గేమ్‌ను ప్రవేశపెట్టింది.
ఈ ఓపెన్ సోర్స్ ఉద్యమం ద్వారా, హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో భారతదేశంలోని ఇతర కార్పొరేట్‌లను లవ్ ఆల్ చొరవలో చేరమని ఆహ్వానిస్తుంది. కంపెనీ తన ఆస్తుల వినియోగాన్ని ప్రజాస్వామికీకరించడం ద్వారా ఈ సమగ్ర ఉద్యమాన్ని ఓపెన్ సోర్స్ చేస్తోంది. లవ్ ఆల్ పోస్టర్‌లు, ఇన్‌క్లూజన్ ప్లేబుక్ మరియు లవ్ ఆల్ కార్డ్‌లతో కూడిన లవ్ ఆల్ ఇన్‌క్లూజన్ కిట్‌లను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కార్పొరేట్‌లు ఈ ఆస్తులను తమ కంపెనీ లోగో మరియు గుర్తింపుతో అనుకూలీకరించడం ద్వారా ఉపయోగించవచ్చు అలాగే వాటిని ముద్రించుకోవచ్చు. వారికి చెందిన సంస్థలలో వైవిధ్యం మరియు ఇన్‌క్లూజన్‌ను ప్రోత్సహించేందుకు ఉపయోగించుకోవచ్చు.

లవ్ ఆల్ https://youtu.be/ZkwHL7BCLqE  ఫిల్మ్‌ను వీక్షించేందుకు లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా మీరు ఈ ఉద్యమం వెనుక ఉన్న శక్తి వివరాలు తెలుసుకోవచ్చు.

దృష్టి లోపం ఉన్న వ్యక్తుల కోసం ఫిల్మ్ మరొక సంస్కరణను సూచించడానికి, దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి – https://youtu.be/cns5D2kpTm0

Spread the love