ప్రజల కోసమే కాంగ్రెస్ పార్టీలోకి: పోచారం..

– రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీతోనే మొదలైంది.
– సీఎం రేవంత్ రెడ్డి రైతు పక్షపాతి
– మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి..
నవతెలంగాణ – నసురుల్లాబాద్ 
బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి కోసమే  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరానని, నా రాజకీయ జీవితమే కాంగ్రెస్ పార్టీతో మొదలైందని మాజీ స్పీకర్ బాన్సువాడ నియోజకవర్గం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో  తెలిపారు.. శుక్రవారం హైదరాబాద్ లోని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మరింత అభివృద్ధి జరిగే అవకాశం ఉందని అవమానించడం మేరకు మాజీ స్పీకర్ బాన్సువాడ నియోజకవర్గం పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి పాటి కండువా కప్పారు. ఈ సందర్భంగా మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  నాయకత్వంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత జరుగుతున్న పరిణామాలను గమనించిన పిమ్మట నేడు నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మా ఇంటికి మనఃస్పూర్తిగా ఆహ్వానించాను.సిఎం రేవంత్ రెడ్డి రైతు పక్షపాతి, రైతు సంక్షేమంతో పాటుగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం సిఎం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజా ఆమోదయోగ్యమైనవిని అన్నారు. నేను స్వయంగా రైతును. రైతుల కష్టసుఖాలు నాకు తెలుసు.
అందుకే సిఎం రేవంత్ రెడ్డి  రైతాంగానికి చేస్తున్న మంచి కార్యక్రమాలకు అండగా ఉండాలని ఆలోచించి సిఎం రేవంత్ రెడ్డి  నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత ఆరు నెలలుగా చేస్తున్న పనులను గమనిస్తున్నాను, చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. కొత్త ప్రభుత్వంలో సమస్యలు సహజం, అయినప్పటికీ చిన్న వయసులోనే సిఎం రేవంత్ రెడ్డి  దైర్యంతో వాటిని అధిగమించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళుతున్నారనీ అన్నారు. రాష్ట్ర మంత్రి వర్గాన్ని అభినందిస్తున్నాను. నేను కూడా మంచి ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీలోకి రావాలనే నిర్ణయం తీసుకున్నానని అన్నారు. నా జీవితంలో రాజకీయంగా ఆశించడానికి ఏమి లేదు. నేను ఆశించేది రైతుల సంక్షేమమే అన్నారు. నా రాజకీయ జీవితంలో ఎక్కువగా రైతులతో సంబంధం ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి, సహకార వ్యవసాయ బ్యాంకు చైర్మన్ గా చేశాను. నా రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీతోనే మొదలైంది. తరువాత టిడిపి, టిఆర్ యస్ లలో పనిచేశాను. ఇప్పుడు చివరకు మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చాన్నారు. సిఎం రేవంత్ రెడ్డి కి ఇంకా ఇరవై ఏళ్ళు రాష్ట్రానికి నాయకత్వం వహించే సామర్థ్యం ఉన్నదన్నారు. సిఎం రేవంత్ రెడ్డి  చేస్తున్న మంచి పనులకు మెచ్చి నాకు వ్యక్తిగతంగా నచ్చి వారి నాయకత్వాన్ని బలపరచాలని, వారి నాయకత్వంలో పనిచేయాలని  నిర్ణయం తీసుకున్నన్నారు. రాష్ట్ర ప్రగతికి చేదోడు వాదోడుగా ఉంటూ రైతుల సంక్షేమం కోసం అందరం సమిష్టిగా కృషి చేస్తామన్నారు. బాన్సువాడ నియోజవర్గంలో ఉన్న కాంగ్రెస్ నాయకుల, కార్యకర్తలతో సమిష్టిగా కలిసి వారి సహకారంతో బాన్సువాడ నియోజకవర్గం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు.
Spread the love