ఇందల్ వాయి మండల పరిషత్ కార్యాలయంలో మండల కేంద్రంలోని ఎస్ అర్ అర్ పాలి క్లినిక్ అద్వర్యంలో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీడీఓ అనంత రావు పాల్గొని మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి ఆరోగ్యమే మహాభాగ్యమని, ఈ శిబిరానికి మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొని ఉచిత చికిత్సలు చేయించుకున్నరు. అవసరం ఉన్నా వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమం లో ఎంపీడీఓ రాజ్ కాంత్ రావు, సుపరింటెండెంట్ లక్ష్మారెడ్డి జూనియర్ అసిస్టెంట్ విమలబాయి,ఎస్ అర్ అర్ పాలి క్లినిక్ వైద్యులు అనుదిప్ తోపాటు పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.