నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్లో భారీ ఎత్తున బంగారాన్ని డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. వివరాల్లోకెళ్తే.. కోల్కత్తా నుంచి హైదరాబాద్కు బస్సులో ఇద్దరు వ్యక్తులు అక్రమంగా బంగారం తరలిస్తుండగా వారిని డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 3,982.25 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఈ బంగారం విలువ సుమారు రూ.2 కోట్లు విలువ ఉంటుందని అధికారులు వెల్లడించారు.