
నవతెలంగాణ – కంఠేశ్వర్
నగరంలోని ఆరవ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. ఈ సంఘటన శుక్రవారం ఉదయం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. మిస్బావుల్ రెహ్మాన్ అనే వ్యక్తి కుటుంబ సమేతంగా హైదరాబాద్ వెళ్లగా గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. పడక గదిలో ఉన్న బీరువాను ధ్వంసం చేసి అందులోని 13 తులాల బంగారం, 40 తులాల వెండితోపాటు నగదును ఎత్తుకెళ్లారు. ఈ చోరీ గురువారం రాత్రి జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం ఉదయం మిస్బాహుల్ రెహమాన్ కొడుకు ఇంటికి వచ్చేసరికి గేట్ తాళం వేసింది వేసినట్టు ఉండగా ఇంటి తాళం పగలగొట్టి చోరీకి పాల్పడినట్టు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని విచారణ చేపట్టారు. పోలీసులు క్లూస్ టీం ద్వారా ఆనవాళ్ళు, వేలిముద్రలు సేకరించారు. నగరంలోని ఆరవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీల ఘటనలు విపరీతంగా పెరిగాయి.