Monday, May 4, 2026
E-PAPER
Homeజాతీయంసత్తా చాటుతున్న టీవీకే…విజయ్‌కి హై సెక్యూరిటీని ఏర్పాటు

సత్తా చాటుతున్న టీవీకే…విజయ్‌కి హై సెక్యూరిటీని ఏర్పాటు

- Advertisement -

వతెలంగాణ తమిళనాడు : తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో టీవీకే సత్తా చాటుతోంది. విజయఢంకా మోగేందుకు సిద్ధమవుతోన్న వేళ …టీవీకే పార్టీ అధినేత విజయ్‌ ఇంటి వద్ద అధికారులు హై సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలువురు నేతలు విజయ్ ఇంటి వద్ద క్యూ కట్టారు. ప్రస్తుతం విజయ్‌ పార్టీ 108 స్థానాల్లో అధిక్యంలో ఉంది. ఈ నేపథ్యంలో విజయ్‌ ఇంటి వద్దకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీగా వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి తొక్కిసలాటలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇతర వాహనాలను విజయ్ ఇంటివైపు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు. తమిళనాడులోని మొత్తం 234 స్థానాలకు తాజా ఎన్నికల కమిషన్ ట్రెండ్స్ ప్రకారం … విజయ్ నేతృత్వంలోని తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన టీవీకే అనూహ్యరీతిలో రాణిస్తోంది. విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే ఈ స్థాయి ఆధిక్యాన్ని ప్రదర్శించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -