నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఉద్యోగ దరఖాస్తుల ప్రాసెసింగ్ ఫీజును రూ.200 నుండి రూ.1,000 వరకు పెంచడాన్ని సిపిఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం, టీజీపీఎస్సీ స్పందించి ఈ ఫీజు పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నది.
గత కొంతకాలంగా ఉద్యోగ నోటిఫికేషన్లు లేక, ఆర్ధిక ఇబ్బందులతో కోచింగ్ సెంటర్లలో వేలాది రూపాయలు ఖర్చు చేస్తూ నిరుద్యోగ యువత పరీక్షలకు సిద్ధమవుతున్నది. దీనికి తోడు ఉద్యోగ దరఖాస్తుల ప్రాసెసింగ్ ఫీజును ఐదింతలు పెంచడం దారుణం. వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇవ్వడం వల్ల, అభ్యర్థులు ప్రతి దరఖాస్తుకు వేలాది రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. ఇది నిరుద్యోగులపై మోయలేని భారాన్ని మోపడమే. తక్షణమే పెంచిన దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజును ఉపసంహరించుకుని పాత ఫీజు విధానాన్ని పునరుద్ధరించాలని, ఖాళీగా ఉ న్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు తక్షణమే పూర్తిస్థాయి నోటిఫికేషన్లు విడుదల చేయాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేస్తుంది.
ఉద్యోగ దరఖాస్తుల ప్రాసెసింగ్ ఫీజుల పెంపు భారం తగదు : సీపీఐ(ఎం)
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



