– అంధకారంలోనే అంబేద్కర్ జయంతి ఏర్పాట్లు
నవతెలంగాణ-రాయికల్: గత కొన్ని రోజులుగా జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని బైపాస్ రోడ్డులోని కొన్ని హైమాస్ లైట్లతో పాటుగా…పట్టణంలోని అంబేద్కర్, గాంధీ విగ్రహాల వద్ద ఉన్న హైమాస్ లైట్లు వెలుగకపోవడంతో మహనీయుల విగ్రహాలు అంధకారంలోనే ఉన్నాయి.అంబేద్కర్ జయంతి ఏర్పాట్లను సైతం చీకటిలోనే చేయాల్సిన పరిస్థితి నెలకొందని, భారత రాజ్యాంగ నిర్మాతకు ఇది అవమానమని అంబేద్కర్ ఆశయ సమితి రాష్ట్ర అధ్యక్షులు చింతకుంట సాయికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. మహనీయుల జయంతి తదితర ఉత్సవాలకు ఆర్భాటాలు చేసే అధికారులు కానీ నాయకులు కానీ పట్టించుకోకపోవడం చాల బాధాకరమని అంబేద్కర్ అభిమానులు,బాపూజీ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించి మహనీయుల విగ్రహాల వద్ద ఉన్న హైమాస్ లైట్లకు మరమ్మత్తులు చేయించాలని పలువురు కోరుతున్నారు.