తేనె టీగాల దాడి.. త్రుటిలో తప్పిన ప్రమాదం

నవతెలంగాణ – మాక్లూర్

మండలంలోని దాస్ నగర్ సమీపంలో గల మహాత్మా గాంధీ జ్యోతిభా పులే సాంఘిక మహిళ గురుకుల పాఠశాల, కళాశాల వద్ద తేనె టిగాలు ఒక్క సారిగా స్తానికులపై శనివారం దాడి చేశాయి. నూతనంగా స్కూల్ లో జాయిన్ చేయడానికి వచ్చిన వారిని తరిమయని, కొందరికి ఒక్కటి, రెండు కుట్టాయని, పిల్లను అండతుకుడా లోపల ఉండటంతో విద్యార్థినిల పై దాడి చేయలేదని స్థానికులు తెలిపారు. తుతీలో ప్రమాదం తప్పిందని అన్నారు. తేనె తీగలు తొలగించడంలో అలసత్వం…గత రెండు నెలలుగా పాఠశాలలు వేసవి సెలవుల వల్ల బందు ఉన్నాయని, పాఠశాలకు అనుకొని ఉన్న తేనె తీగలను తొలగించడంలో పాఠశాల మేనేజ్ మెంట్ అలసత్త్వం వహించిందని విద్యార్థినిల తల్లిదండ్రులు అంటున్నారు.
Spread the love