నవతెలంగాణ-హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఐసీఐసీఐ బ్యాంకులో రిలేషన్‌షిప్ మేనేజర్‌గా పనిచేస్తున్న తన భార్య దివ్య మిశ్రాపై ఆమె కార్యాలయం వద్ద భర్త మానస్ మిశ్రా కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించగా మృతి చెందారు. అనంతరం హుసారియా ప్రాంతంలోని తన నివాసానికి వెళ్లిన మానస్.. అక్కడ తన సోదరి షీబా బజ్‌పాయ్‌పై కూడా కాల్పులు జరిపాడు. ఆ తర్వాత తనపై కాల్పులు జరుపుకుని మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు ఘటనా స్థలాలకు చేరుకుని దర్యాప్తు చేపట్టాయి. భార్యాభర్తల మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ కేసుపై దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.
లక్నోలో దారుణ ఘటన
- Advertisement -
- Advertisement -



