Wednesday, June 10, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయందక్షిణాఫ్రికాలో దారుణం.. 12 మంది మృతి

దక్షిణాఫ్రికాలో దారుణం.. 12 మంది మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: దక్షిణాఫ్రికాలో ఓ దుండ‌గ‌ల ముఠా రెచ్చిపోయింది. అమాయ‌క‌మైన జ‌నాల‌పై కాల్పుల‌తో ఊచ‌కోత కోసింది. మంగళవారం సాయంత్రం(ఆ దేశ స్థానిక స‌మ‌యంలో) గుడిసెలు వేసుకుని నివశిస్తున్న వారిపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటన జోహెన్నెస్‌‌బర్గ్‌‌కు తూర్పున ఉన్న క్లీవ్‌ల్యాండ్‌లో జరిగింది. అనుమానితులు తెల్లటి టయోటా క్వాంటమ్‌లో వచ్చి అకస్మాత్తుగా గుడిసెల్లో ఉండేవారిపై తుపాకులతో కాల్పులు జరిపి పరారయ్యారు.

ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. 9 మంది గాయాలపాలయ్యారు. గాయపడిన వారికి అధికారులు ఆసుప్రతిలో చికిత్సనందిస్తున్నారు. అయితే ఈ దుండగులు ఈ కాల్పులు జరగడానికి గల కారణం తెలియరాలేదని పోలీసులు అభిప్రాయపడ్డారు. పరారైన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దర్యాప్తు ప్రారంభించారు.

కాగా, జోహెన్నెస్‌‌బర్గ్‌ దాని పరిసర ప్రాంతాల్లో అక్రమ మైనింగ్‌ ‌ముఠాలు ఉన్నట్లు తెలుస్తోంది. క్లీవ్‌‌ల్యాండ్‌‌లో కూడా అక్రమ మైనింగ్‌ ‌కార్యకలాపాలు జరుగుతాయి. బహుశా ఈ ముఠాలే సొంతంగా ఇళ్లులేని నివాసితులపై కాల్పులు జరిపి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -