Friday, July 3, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఘోర రోడ్డు ప్రమాదం..40 మంది మృతి

ఘోర రోడ్డు ప్రమాదం..40 మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : పాకిస్థాన్‌ దక్షిణ పశ్చిమ రాష్ట్రం బలూచిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు లోయలో పడిపోవడంతో 40 మంది మృతి చెందారు. శుక్రవారం ఉదయం క్వెట్టా నుంచి దేశ రాజధాని ఇస్లామాబాద్‌ వైపు వెళ్తున్న ఈ బస్సు షెరాని–జోబ్ హైవేపై దనసర్ ప్రాంతంలో అదుపుతప్పి లోతైన లోయలో పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో ఎంతమంది ఉన్నారన్నదానిపై స్పష్టత లేదు. రెస్క్యూ బృందాలు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి.గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రమాద స్థలంలో ఆరు అంబులెన్సులు, 12 మంది ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు, పది లైట్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. స్థానిక అధికారులతో పాటు సమీప ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంత రెస్క్యూ బృందాలు కూడా ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -