నవతెలంగాణ – మల్హర్ రావు
ఓసీపీకి డేంజర్ జోన్లో ఉన్న ఇండ్లు,భూములు సేకరించాలంటూ భూ నిర్వాసితులు,ఉపాధిహామీ కూలీలు శుక్రవారం నల్ల బ్యాడ్జీలతో ఉపాధిహామీ పని ప్రదేశంలో వినూత్న నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా మాట్లాడారు 2013 భూ సేకరణ చట్టం నిబంధనలను తుంగలో తొక్కి, భూ నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండానే, బొగ్గు వెలుకతీత పనులను చేపట్టడం జరిగిందని ఆరోపించారు.జెన్కో నుండి సబ్ కాంట్రాక్టు పొందిన ఎమ్మార్ కంపెనీ గత 8 సంవత్సరాల నుండి బ్లాస్టింగ్ చేస్తూ బొగ్గు వెలికితీత పనులను ప్రారంభించారని, బ్లాస్టింగ్ తర్వాత వచ్చే దుమ్ము దులితో డేంజర్ జోన్లోని భూ నిర్వాసితులు పలు రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు.2022 సంవత్సరంలో నోటిఫికేషన్ ద్వారా ఇండ్లను సేకరిస్తామని పేపర్ ప్రకటన ద్వారా పేర్కొన్నారని గుర్తు చేశారు.జెన్కో భూనిర్వాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించకుండానే వీరి ఇండ్ల పక్కన మట్టి డంపింగ్ చేయడానికి పనులు చేస్తున్నారని,గురువారం ఏమ్మార్ కంపెనీ చేస్తున్న పనులను అడ్డుకొని అధికారులను వెనక్కి పంపించడం జరిగిందన్నారు.దీనికి నిరసనగా డేంజర్ జోన్లోని 200 మంది ఉపాధి హామీ కూలీలు నల్ల బ్యాడ్జీలు ధరించి తాడిచెర్ల గ్రామంలోని చింతలకుంట చెరువులో ఉపాధి హామీ పనిలో పాల్గొని నిరసన వ్యక్తపరిచ్చినట్లుగా తెలిపారు.ఈ సందర్భంగా తాడిచర్ల కాపురం గ్రామాల జెన్కో భూనిర్వాసితుల హక్కుల సాధన పోరాట కమిటీ అధ్యక్షుడు కేసారపు రవి మాట్లాడుతూ డేంజర్ జోన్లో నివసిస్తున్న భూనిర్వాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేంతవరకు ఇండ్ల పక్కన మట్టి డంపింగ్ పనులు చేయరాదని పేర్కొన్నారు.నల్ల బ్యాడ్జీలు ధరించి ఉపాధి హామీ కూలీలు పనిచేయడం అనేది భూ నిర్వాసితుల ఐక్యతను చాటిందని, ప్రభుత్వ అధికారులతో పాటు ప్రభుత్వం వెంటనే స్పందించి ఇండ్లకు నష్టపరిహారంతో పాటు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ పునరావాస కల్పించే విధంగా పనులు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.