
విద్యార్థులు జీవితంలో విజయం సాధించుటకు క్రింది సూచనలను పాటించాలని మండల విద్యాధికారి సోమవారం పదవ తరగతి పరీక్షలు పడుతున్న సమయం లో వారికీ కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు.విద్యార్థులు ప్రతిరోజు ఉదయం బ్రహ్మముహూర్తం ఉదయం 4 గంటల నుండి 6 గంటల మధ్య సమయంలో గదిలో మీకు సౌకర్యంగా ఉండే స్థలములో కూర్చొని చదువుకొనవలయును. ఈ సమయంలో చదివినచో మిగతా సమయంలో చదివిన దానికన్నా మూడు రెట్లు ఎక్కువ ఫలితముండును.మీరు ముందు ఒక అంశమును చదువవలయును. తిరిగి అదే అంశమును రెండవసారి చదువవలయును. మూడవసారి కళ్ళు మూసుకొని మనసుతో చదవవలయును. ఆ తదుపరి చదివిన దానిని గుర్తుచేసుకోవలయును. చదివిన అంశము చాలా రోజులు గుర్తుండుట కొరకు కాగితముపై రాయవలయును.విద్యార్థులు వీలయినంతవరకు ఆంగ్లంలోని ఆరు విషయాలకు దూరంగా ఉండవలయును.సినిమాలూ,,క్రికెట్ మ్యాచులను టివి లో అదేపనిగా చూడరాదు.ఇంట్లో టివి వసరం అయితే తప్పు కొద్దీ సేపు విక్షించాలి, సెల్ ఫోన్ కు దూరంగా ఉండాలి,చాటింగ్,చెత్త కబుర్లతో కాలం వృథా చేయరాదు.చదివేటప్పుడు ఏకాంగ్రత ఉండాలి.ఎన్ని గంటలు చదివాను’ అనే ఆలోచనను వదిలేసి ఎన్ని గంటలు అర్ధవంతంగా చదివాను’ అనేదానికి ప్రాధాన్యత ఇవ్వాలి. సిలబస్ చూసి భయపడరాదు 1000 మైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది, అలాగే ఒక్కొక్క అంశం చదువుతూ ముందుకు సాగితే ఎంత సిలబస్ అయినా పూర్తచేయవచ్చు.ఒక అట్టపై డూ ఇట్ నౌ అక్షరాలను రాసి, ఆ అట్టాను మీరు చదువుకునే గదిలోని పాఠ్యపుస్తకాలు గల బల్లపై ఉంచండి. అట్లాగే మరొక అట్టపై నాట్ నౌ ప్లీజ్ :అనే అక్షరాలను రాసి మీ ఇంట్లోని టీవీ పై రాసి ఉంచండి.జీవితం ఓ పరుగుపందెం లాంటిది. ఈ పరుగుపందెంలొ పక్కకు, వెనుకకు చూడకుండా సూటిగా మెరుపు వేగంలో ముందుకు దూసుకు వేళ్లేవారికి విజయం వరిస్తుంది.మానసిక ఒత్తిడికి దూరంగా వుండండి, మనసు, మెదడు రెండింటిని సమన్వయపరచండి, ఎప్పుడూ నవ్వుతూ, సంతోషంగా, ఆనందంగా ఉండండి, “జీవించేది బాధపడడానికి కాదు, ఏదైనా సాధించడానికి” అనే భావనను అలవర్చుకోండి. ఇతరులపై ఈర్శతో కాకుండా పోటీతత్వంతో చదవండి.మీరు ఎంచుకున్న రంగంలో చరిత్ర సృష్టించడానికి ప్రయత్నం చెయ్యండి. “మనం విజయం సాధించాలంటే చరిత్రను పునరావృతం చెయ్యడం కాదు, కొత్త చరిత్ర సృష్టించాలని మహాత్మా గాంధీ
చాటి చెప్పిన సిద్దాంతం గుర్తుకు తెచ్చుకొండి: మంచి శీలం. సత్ప్రవర్తన కలిగియుండాలి. అహంకారం లేకుండా ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండవలయును. అన్ని విషయాలను సమగ్రంగా నేరుకొనవలయును.విద్యార్థులకు తమపట్ల విశ్వాసం పెంచుకొని ఒక ఖచ్చితమైన లక్ష్యాన్ని ఎంచుకోవలెను. విద్య అనే శ్రమనే కష్టేఫలి గా భావించాలి.మీరు ఎంత కష్టపడి కాదు ముఖ్యం ఇష్టపడి చదివితే అంత మంచి ఫలితాన్ని పొందుతారు. ప్రతి రోజు ఉదయం కొంత సమయం ధ్యానం చేయ్యవలయును. దీనివల్ల ఏకాగ్రతను జ్ఞాపకశక్తిని పెంచుతుంది.ఇవన్నీ విద్యార్థులు పాటించి చదివితే విజయం మీ సొంతం అవుతుందని సూచించారు.