
– ఒకే కేంద్రంలోని రెండు తూకం యంత్రాలలో వేరువేరుగా ధాన్యం బస్తాల వ్యత్యాసాలు
– క్వింటాల్ కు నాలుగు కిలోల చొప్పున అదనంగా దండుకుంటున్న పీఏసీఎస్ నిర్వాహకులు
– రైస్ మిల్లర్లతో సీఈఓ రాజు ఒప్పందం చేసుకున్నట్లు రైతులు ఆరోపణ
– కేంద్రంలో కనీస మౌలిక సదుపాయాలు లేక రైతులు మండుటెండల్లో ఇబ్బందులు
– ఈ కొనుగోలు కేంద్రంలోని వడదెబ్బతో ఓ రైతు మృతి చెందిన సంగతి తెలిసిందే
నవతెలంగాణ – మిరుదొడ్డి
ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు అన్నదాతలు ఆపసోపాలు పడవలసిన పరిస్థితి నెలకొంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలోని పిఎసిఎస్ కొనుగోలు కేంద్రంలో నిర్వాహకులు అన్నదాతలను మోసం చేస్తున్నట్లు రైతులు ఆరోపించారు. కొనుగోలు కేంద్రంలోని తూకం లో బస్తాల వ్యత్యాసం ప్రస్ఫుటంగా కనిపిస్తుందన్నారు. ఓ రైతుకు చెందిన 41కిలోల ధాన్యం బస్తాను తూకం వేశారు. రైతుకు తూకం విషయంలో అనుమానం రావడంతో అదే కేంద్రంలోని మరోతూకం పై అదే బస్తాను తూకం వేస్తే 42.350 కిలోలు వచ్చింది. ఒకే కేంద్రంలో ఉన్న రెండు తూకం యంత్రాల్లో కిలోన్నర వ్యత్యాసం ఉండడముతో రైతులు ఒక్కసారిగా నిర్గాంత పోయారు. రోజుకు కొన్ని వేల కిలోల చొప్పున రైతుల నుంచి దోపిడికి గురి చేస్తున్న నిర్వాహకులైన సిఈఓ రాజు పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద కనీస సౌకర్యం లేకపోవడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు పీఏసీఎస్ సిబ్బంది రైతులను ఇబ్బంది పడుతూ పెడుతున్నారని ఆరోపణ వినిపిస్తున్నాయి.
రైస్ మిల్ యజమానులతో కుమ్మక్కై పీఏసీఎస్ కార్యదర్శి రాజు మరి ధాన్యం కొనుగోలులో జాప్యం చేస్తూ ధాన్యాన్ని ఎక్కువగా తూకం చేయడం జరుగుతుందని రైతులు ఆరోపిస్తున్నారు.ఈ విషయము తెలుసుకున్న టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కమలాకర్ రెడ్డి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతుల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అకాల వర్షంతో తడుస్తున్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు టార్పిండ్లను ప్రైవేటు వ్యక్తుల దగ్గర అద్దెకి తీసుకోవాల్సి వస్తుందన్నారు. ఒక్కో టార్పిలన్ రూ. 30 నుంచి రూ. 50 చొప్పున అద్దెకు తీసుకుంటున్నారు. ఇలా ఒక్క రైతు తన ధాన్యాన్ని కాపాడుకోవడం కోసం నాలుగు నుండి ఐదు కావాలను ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుండి అద్దెకు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కొనుగోలు కేంద్రంలో సుమారు 7 నుంచి పది రోజుల వరకు ధాన్య విక్రయించడానికి వేచి చూడాల్సి వస్తుందన్నారు. దీంతో టర్బోలిన్ కవలకే రూ 1000 నుండి 1500 వరకు ఆర్థిక భారం పడుతుందన్నారు. మండుటెండల్లో కేంద్రాల్లో కనీసం టెంట్లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో చెట్ల నీడన తలదాచుకుంటున్నామని రైతులు బోరున విన్నవించారు. తూకంలో వ్యత్యాసం ఉన్న విషయాన్ని నేరుగా పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో అన్నదాతలు వడదెబ్బతో మృత్యువాత పడుతున్నట్లు తెలిపారు. ఇటీవల గ్రామానికి చెందిన యాదగౌడ్ వడదెబ్బతో మృతిచెందనం బాధాకరమన్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వహణ సక్రమంగా జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.