తెలంగాణ ప్రభుత్వ శవయాత్రలో భారీ ర్యాలీ 

– అనంతరం దహనం శవాన్ని అగ్గిపెట్టిన
– అంగన్వాడి ఉద్యోగులు నినాదాలతో ఏడుపులతో హోరెత్తిన ధర్నా చౌక్ 
– తెలంగాణ ప్రభుత్వ శవయాత్రలో భారీ ర్యాలీ పాల్గొన్న అంగన్వాడి ఉద్యోగులు 
– శవాన్ని అగ్గిపెట్టిన సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్
నవతెలంగాణ కంటేశ్వర్
మట్టి ఖర్చులతో సరి పెడితే ఊరుకోం, అధికారులు ఫోజుల కోసమే తాళాలు పగలగొట్టారు, ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేసిన ఘనత ఈ సమ్మెదే మంత్రి మాటలన్నీ పచ్చి అబద్ధాలు సమస్యలు పరిష్కారం అయ్యేవరకు సమ్మె ఆపేది లేదు, సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం  శవయాత్రానంతరం సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గోవర్ధనలు మాట్లాడుతూ..బలం బలగం ప్రభుత్వ యంత్రాంగం ఉంది. ఏదైనా చేయవచ్చని ముఖ్యమంత్రి కెసిఆర్ అనుకుంటున్నారు. ఆయనకు అనుభవం తక్కువ అంగన్వాడిలా సత్తా ఏంటో తెలవదు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు, కాంగ్రెస్ పార్టీకి బాగా తెలుసు. అంగన్వాడీల సమస్యలను సామరస్యంగా పరిష్కరించకుంటే వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తామని, మట్టి ఖర్చులతో సరిపెడితే ఊరుకునేది లేదు అని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ తీవ్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాన్నిహెచ్చరించారు.ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, 26వేల కనీస వేతనం ఇవ్వాలని, టీచర్లకు 10 లక్షల రూపాయలు, ఆయాలకు 5 లక్షల రూపాయల బెనిఫిట్ లు ఇవ్వాలని, పని భారాన్ని తగ్గించాలని పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఆమె అన్నారు. రాష్ట్రంలో తెలంగాణ రాకముందు ఈ పోరాటం జరిగిందో నేడు అంగన్వాడీలు వచ్చేస్తున్న పోరాటం అదే స్థాయిలో ఉందని రాష్ట్రవ్యాప్తంగా సమ్మెపై చర్చ జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ యంత్రాంగానికి నిద్ర లేకుండా చేస్తున్న సమ్మెగా అంగన్వాడీ ఉద్యోగుల సమ్మె చరిత్రలో నిలిచిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధ ధోరణిలో సమ్మెకు ఆటంకాలు కల్పించే విధంగా చర్యలు చేపడుతున్న అంగన్వాడి ఉద్యోగులు ఎక్కడ వెనుకడుగు వేయకుండా డి అంటే డి అనే విధంగా కేసీఆర్ కు సవాల్ విసురుతున్న పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. రాష్ట్రo ఏర్పాటు కాకమందు అనేక విషయాలలో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు వాటిని పూర్తిగా విస్మరించారు విమర్శించారు. అంగన్వాడీలు వర్కర్లు కాదని టీచర్లు అని పేర్కొన్న కెసిఆర్ వారి సమస్యలను పరిష్కరించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, స్వరాష్ట్రంలో కూడా అంగన్వాడి ఉద్యోగులు తిరిగి వెనక్కి చూసుకుంటే చాలీచాలని వేతనాలతో పూర్వ పరిస్థితి ఉందని ఆవేదన చెందారు.మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడే మాటలు పచ్చి అబద్దాలని మండిపడ్డారు. తమిళనాడు, పాండిచ్చేరిలో అంగన్వాడీ ఉద్యోగుల విషయాలపై మాట్లాడమంటే ఆ రెండు రాష్ట్రాలను మినహాయించి మిగతా రాష్ట్రాలని పరిస్థితుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కేరళలో 12000 వేతనం ఇస్తే 6000 రూపాయలు ఇస్తున్నారని మంత్రి చెప్పడం దౌర్భాగకరమన్నారు. అంగన్వాడీ ఉద్యోగులకు జీతం ఎంత ఉందో తెలియని మంత్రి ఏలా ఆ పదవిలో రాణిస్తున్నారు అర్థం కావడం లేదన్నారు. అంగన్వాడీ ఉద్యోగులపై ఏమాత్రమైన మంత్రికి అవగాహన ఉందా అని ప్రశ్నించారు. రోడ్డుపైకి వచ్చి సమ్మె చేస్తున్న అంగన్వాడి ఉద్యోగులతో కాకుండా ఇతర సంఘాలు ఉద్యోగు నాయకులతో చర్చలు జరపడం ఎంతవరకు సబమన్నారు.తెలంగాణ ప్రభుత్వంలో అంగన్వాడీ టీచర్లకు సంక్షేమ పథకాలను అన్నింటిని దూరం చేశారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం అంగన్వాడి యూనియన్ నాయకత్వం పిలిపించి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి స్వర్ణ , సందీప, సునీత, జరీనా, సరిత, సునీత, శివ, రాజమ్మ, సుజాత రాధికా , స్వప్న , విజయ , రేణుక, సందీప, గోదావరి, సందీప, స్రవంతి రాణి తదితరులు పాల్గొన్నారు.
Spread the love