Homeఆదిలాబాద్బ్రహ్మేశ్వర్ ఆలయంలో హుండీ చోరీ  

బ్రహ్మేశ్వర్ ఆలయంలో హుండీ చోరీ  

- Advertisement -

నవతెలంగాణ-కుభీర్
మండలంలోని బ్రహ్మేశ్వర్ గ్రామపంచాయతీ లో ఉన్న బ్రహ్మేశ్వర పురాతనమైన శివాలయం గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి ఆలయంలోకి చొరబడి  చోరీకి పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. బ్రహ్మేశ్వర్ ఆలయానికి  ప్రతి ఏడాది శ్రావణ మాసంలో అధిక సంఖ్యలో భక్తులు వచ్చి  ఎక్కడ ఉన్నారు జలపాతాన్ని సందర్శించి పక్కన ఉన్న శివాలయమును దర్శించుకుని  ముక్కు లు తీర్చుకుంటారు. భక్తులు భక్తులు సమకూర్చిన  కానుకులను హుండీలో  వేస్తారు. దీంతో ఆలయ సిబ్బంది శుక్రవారం ఉదయం గమనించగా ఆలయ ఉండి తాళాలు పగిలిపోవడం గమనించిన ఆలయ పూజారి గ్రామస్తులకు సమాచారం అందించడంతో వారు ఆలయానికి చేరుకుని పరిశీలించారు. దీంతో ఆలయ ఉండి తాళాలు పగలగొట్టి అందులో ఉన్న నగదును  తీసుకెళ్లినట్లు  సిబ్బంది తెలిపారు. ఈ విషయం కుభీర్ ఎస్సై కృష్ణారెడ్డికి వెంటనే సంఘటన స్థలాన్ని పరిశీలించి చోరీకి సంబంధించిన పలు విషయాలను  గ్రామస్తులకు అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ కృష్ణ రెడ్డి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -