– ముగిసిన జాతీయ కరాటే పోటీలు
హైదరాబాద్ : 2027 ఆసియా కరాటే చాంపియన్‌షిప్ పోటీలకు హైదరాబాద్ వేదిక కానుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ‘హైదరాబాద్‌ను స్పోర్ట్స్ హబ్’గా తీర్చిదిద్దుతున్నారని పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో నాలుగు రోజుల పాటు జరిగిన జాతీయ కరాటే పోటీలు శనివారంతో ముగిశాయి. 1500 మంది క్రీడాకారులు పోటీపడిన ఈవెంట్‌లో విజేతలుగా నిలిచిన అథ్లెట్లు, జట్లకు మహేశ్‌కుమార్ గౌడ్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కరాటే క్రీడాకారులకు సీఎం రేవంత్‌రెడ్డి తన సందేశాన్ని పంపించారు. ‘బడ్జెట్‌లో క్రీడలకు అధిక నిధులు కేటాయిస్తున్నాం. స్పోర్ట్స్ యూనివర్శిటీతో ప్రపంచ శ్రేణి క్రీడాకారులను తయారు చేయనున్నాం. విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు అభినందనలు’ అని సీఎం సందేశంలో పేర్కొన్నారు.