హైదరాబాద్ సెంట్రల్ యూనిర్సిటీ వైస్ ఛాన్సలర్ దిష్టి బొమ్మ దగ్ధం: ఎస్ఎఫ్ఐ

నవతెలంగాణ – డిచ్ పల్లి
హైదరబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ దిష్టి బొమ్మను గురువారం భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ ఎఫ్ ఐ) రాష్ట్ర కమిటీ పిలుపు లో భాగంగా తెలంగాణ యూనివర్సిటీ కమిటీ ఆద్వర్యంలో యూనివర్సిటీ న్యూ బాయ్స్ హాస్టల్ ముందు హైదరబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సంధర్బంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేష్ మాట్లాడుతూ.. హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ లో వీసీ గెస్ట్ హౌస్ ముందు స్టూడెంట్స్ యూనియన్ నాయకులు హక్కుల కోసం నిరసన తెలియజేసి నందుకు గాను, విద్యార్థుల చేత ఎన్నుకోబడ్డ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షున్ని,  మాజీ విద్యార్థి సంఘం నాయకులను, ఎస్ ఎఫ్ ఐ నాయకులను మొత్తం ఐదుగురిని క్యాంపస్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా యూనివర్శిటీ యాజమాన్యం నిర్ణయం తీసుకుందని వివరించారు. ఈ నిరసన తర్వాత విద్యార్థుల పైన పోలీసు కేసులు పెట్టడమే కాకుండా విద్యార్థులను యూనివర్శిటీ నుంచి వెలివేస్తు సస్పెన్షన్ నిర్ణయం తీసుకుందని, సస్పెన్షన్ కాబడ్డ ఈ ఐదుగురు చాల నిరుపేద కుటుంబాల నుంచి అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వారన్నారు. ఈ సస్పెన్షన్ తో వారి చదువులు, స్కాలర్షిప్లు అన్నీ ప్రశ్నార్ధకంలో పడనున్నాయని,ఇదే యూనివర్సిటీ  లో ఎనిమిదేళ్ళ కిందట ఏ విధంగా రోహిత్ వేములను ఇదే రకంగా వెలివేసి అతని హత్యకు యూనివర్శిటీ యాజమాన్యం కారణం అయిందో మనకు తెలిసిన విషయమన్నారు. యూనివర్శిటీ లో ప్రస్తుత పరిస్థితులు ఇదే విధంగా రావడం యూనివర్శిటీ లో మళ్ళీ పెరుగుతున్న నిరంకుశత్వాన్ని , అణచివేతను ఎలుగెత్తి చాటి చెప్తున్నాయి. ఇప్పటికైన వెంటనే వారి పై సస్పెన్షన్ నీ ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ తెలంగాణ యూనివర్సిటీ ఉపాధ్యక్షులు దినేష్, చిత్రు, అరవింద్, కృష్ణ, రాకేష్, రోషన్, తదితర నాయకులు పాల్గొన్నారు.
Spread the love