Saturday, May 30, 2026
E-PAPER
Homeబీజినెస్హైదరాబాద్ నివాస అమ్మకాల్లో 16 శాతం వృద్ధి : నైట్‌‌ఫ్రాంక్‌ వెల్లడి

హైదరాబాద్ నివాస అమ్మకాల్లో 16 శాతం వృద్ధి : నైట్‌‌ఫ్రాంక్‌ వెల్లడి

- Advertisement -

న‌వతెలంగాణ‌ – హైదరాబాద్‌
ఈ ఏడాది ఏప్రిల్లో హైదరాబాద్ నివాస మార్కెట్ రూ.4,673 కోట్ల విలువైన 6,837 ఆస్తుల నమోదుతో 16 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసిందని రియాల్‌ ఎస్టేట్‌ ‌కన్సల్టంట్‌ ‌నైట్‌‌ఫ్రాంక్‌ ఓ రిపోర్ట్‌‌లో వెల్లడించింది. రూ.1 కోటి పైబడిన ప్రీమియం గృహాలు మొత్తం విలువలో 49 శాతం వాటాను కలిగి ఉండగా, రూ.50 లక్షల లోపు అందుబాటు ధరల ఇళ్ల విభాగం కూడా 18 శాతం పెరుగుదల చోటు చేసుకుందని నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్ శిశిర్ బైజాల్ పేర్కొన్నారు. డిమాండ్ కేవలం ప్రీమియం విభాగానికే పరిమితం కాకుండా అందుబాటు ధర, మధ్య ఆదాయ విభాగాల్లోనూ పెరగడం మార్కెట్ లోతును, కొనుగోలుదారుల విస్తృత భాగస్వామ్యాన్ని సూచిస్తోందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -