– మాజీ మంత్రి మల్లారెడ్డి
నవతెలంగాణ-సిటీబ్యూరో
తనపై నమోదైన భూ కబ్జా కేసుపై మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పందించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తాను భూ కబ్జా చేసినట్టు వస్తున్న వార్తలు అవాస్తవన్నారు. గిరిజనుల 47 ఎకరాలకు సంబంధించిన భూమి కబ్జా విషయంలో తనకు ఎలాంటి సంబంధమూ లేదని చెప్పారు. భూములు కబ్జా చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. కొంతమంది మధ్యవర్తులు కొనుగోలు, అమ్మకాల్లో ఉన్నారని.. గిరిజనుల భూమిని వారే కబ్జా చేసి ఉంటారని అన్నారు. భూ కబ్జా ఆరోపణలపై కోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు. అయితే, ఇది ప్రభుత్వ కక్ష సాధింపు చర్య కాదన్నారు.