నాకు తెలుసు
నేను మారాలి
నా ఆలోచనా
ధోరణి మారాలి
నేటి సమాజంలో
నా మనుగడ కై
నాకు తెలుసు
జనులకు ఉన్నది
ఉన్నట్లు చెబితే
అదే నేను చేసే
పొరపాటుజి
చెప్పకపోతే మాత్రం
జనులకు చేటు
ఎల్లవేళలా నేను
అలవర్చుకుంటాను
విని విననట్టు
చూసి చూడనట్టు
మాటలే రానట్టు
నా నడవడికను
అలాగే నేను చేస్తా
ఓ చిన్ని మేలు
ఎవ్వరిని నొప్పింపక
తానోవ్వక
అందరివాడవై
సకల జనుల
యోగక్షేమాలకై
– డాక్టర్ మైలవరం చంద్రశేఖర్