కరీంనగర్ లో రాజకీయ విమర్శలు చేయను..

I will not make political criticism in Karimnagar..– అందరితో కలిసి పనిచేసి నియోజకవర్గాన్ని అభివ్రుద్ది చేస్తా..
– పదవులొస్తాయి…పోతాయి…. అభివృద్దే శాశ్వతం
– కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు
– ఎమ్మెల్యే గంగుల, మేయర్ సునీల్ రావుతో కలిసి ‘ఇంటిగ్రేటెడ్ మార్కెట్’ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి
నవతెలంగాణ – కరీంనగర్ 
రాజకీయాల్లో పదవులు వస్తుంటాయి, పోతుంటాయని, కానీ చేసిన అభివృద్దే శాశ్వతంగా నిలిచిపోతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇకపై తాను రాజకీయ విమర్శలు చేయదల్చుకోలేదన్నారు. జెండా, ఎజెండాలను పక్కనపెట్టి అభివృద్దే ధ్యేయంగా అన్ని పార్టీల నాయకులతో కలిసి పనిచేస్తానన్నారు. కరీంనగర్ లో ఎమ్మెల్యే గంగుల, మేయర్ సునీల్ రావుతో కలిసి పద్మానగర్ లోని 16వ డివిజన్ లో నూతనంగా నిర్మించిన ‘ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్’ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ .. స్మార్ట్ సిటీ నిధులు అనేక కారణాలవల్ల పూర్తిగా వినియోగంలోకి రాలేదు. ఇప్పుడిప్పుడే అవన్నీ ఖర్చు చేసి అభివృద్ది చేసుకుంటున్నం. వరంగల్ కు ధీటుగా కరీంనగర్ ను అభివ్రుద్ధి చేసుకుంటున్నం. కేంద్రం నుండి తప్పకుండా నిధులు తీసుకొస్తా. రాష్ట్ర ప్రభుత్వం నుండి  రావాల్సిన నిధుల కోసం కొట్లాడి సాధించుకుంటాం. రాజకీయాల్లో పదవులు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ చేసిన అభివ్రుద్ధే శాశ్వతంగా నిలిచిపోతుంది. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇకపై తాను రాజకీయ విమర్శలు చేయదల్చుకోలేదు. జెండా, ఎజెండాలను పక్కనపెట్టి అభివ్రుద్దే ధ్యేయంగా నాయకులతో కలిసి పనిచేస్తా అన్నారు.
Spread the love