అక్రమంగా ఇసుకను తరలిస్తే చర్యలు తప్పవు..

నవతెలంగాణ – మిరుదొడ్డి 
రాత్రి సమయంలో వాగు నుండి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. వాల్టా చట్టానికి ఇసుక మాఫియా తూట్లు పొడుస్తున్న పట్టించుకునే వారే కరువయ్యారు. మిరుదొడ్డి మండల కేంద్రంలోని నాగయ్య వాగు నుండి ఇసుకను యదేచ్చగా అక్రమంగా తరలిస్తున్నారు. రోజుకు పదుల సంఖ్యలలో ట్రాక్టర్ల ద్వారా ఇసుకను ఒకచోట డంపు చేసి డబ్బులు దండుకుంటున్నారు. ఒక్కో ట్రాక్టర్ ఇసుక ట్రిప్పుకు సుమారు రూ.6000 నుండి రూ.7000 రూపాయల వరకు ఇసుకాసురులు వసూలు చేస్తున్నారు. పేదోడు ఇంటి నిర్మాణం లేదా మరుగుదొడ్ల నిర్మాణానికి ఇసుక కావాలంటే అధికారుల అనుమతి లేకుండా వెళ్తే వెంటనే ట్రాక్టర్లను సీజ్ చేసే పోలీస్, రెవెన్యూ అధికారులు ఇసుక మాఫియా యదేచ్చగా రాత్రుల్లో ఇసుకను తరలిస్తే పట్టించుకోకపోవడం పై మండల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక మాఫియా డంపు చేసిన విషయాన్ని టాస్క్ ఫోర్స్ అధికారుల దృష్టికి మీడియా ద్వారా తీసుకు వెళ్ళడంతో అధికారులు స్పందించారు. అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపులను పరిశీలించి సీజ్ చేశారు. ఎవరైనా ఇసుకను అక్రమంగా తరలించిన, నిల్వచేసిన తమ దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
Spread the love