
ప్రణాళిక బద్దంగా చదివితే సమాజంలో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తొర్రూరు సీఐ గణేష్, ఎంఈవో బుధారపు శ్రీనివాస్, ఎంపీడీవో వేణుమాధవ్ అన్నారు. చిట్యాల, పెద్దవంగర జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో పదోతరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం మంగళవారం ఘనంగా నిర్వహించారు. చిట్యాల పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో సీఐ, ఎస్సై క్రాంతి కిరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ప్రధానోపాధ్యాయుడు అర్రోజు విజయ్ కుమార్ తో కలిసి మాట్లాడారు.. విద్యార్థి దశలో పదవ తరగతి అత్యంత కీలకమన్నారు. ప్రతి విద్యార్థి లక్ష్యాలను ఎంచుకుని ముందుకు సాగినప్పుడే జీవితంలో ఉన్నత శిఖరాలకు అధిరోహిస్తారని అన్నారు. పరీక్షల సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, పట్టుదలతో చదివితే విజయం సాధిస్తారన్నారు. పదిలో ఉత్తమ ఫలితాలు సాధించి పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ స్వాతి, హాస్టల్ వార్డెన్ గంట భాస్కర్, ఉపాధ్యాయులు, రాజలింగం, సదయ్య అంజయ్య, గౌరీ శంకర్, ముఖేష్, శ్రీధర్, సారయ్య, తఖీ పాషా, రమేష్, కోటేశ్వర్, సురేందర్, యాకన్న, శివకుమార్, యుగేంధర్, రమేష్, మల్లేష్, నరేష్ పాల్గొన్నారు.