నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం బుధవారం రాత్రి నిర్వహించినారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ భీన్ హంధాన్, కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ వినయ్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా మైనార్టీ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పవిత్ర రంజాన్ మాసం విశిష్టతను పెద్దలు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అయ్యప్ప శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ రాజు, తహసిల్దార్ సత్యనారాయణ మర్కజ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.