సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

నవతెలంగాణ – వలిగొండ రూరల్
మండల పరిధిలోని గోకారం గ్రామంలో సోమవారం ముస్లిం సోదరులకు సీపీఐ(ఎం) పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో  ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైనదని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు తుర్కపల్లి సురేందర్, మద్దెల రాజయ్య, నారి రామస్వామి, నారి జంగయ్య, కౌడే సురేష్, చెరుక వెంకటేష్, మైనార్టీ సోదరులు అబ్దుల్ కరీం,అబ్దుల్ రవుఫ్, సమధ్ , హకీం, జహంగీర్ , జాఫర్, ఇమ్రాన్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love