నవతెలంగాణ – తంగళ్ళపల్లి
రైతులు పండించిన సన్న వడ్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.500 బోనస్ అందిస్తుందని మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వెలుముల స్వరూప తిరుపతి రెడ్డి అన్నారు. మండలంలోని బద్దెనపల్లి గ్రామంలో వడ్ల కొనుగోలు సెంటర్ ను బుధవారం ప్రారంభించారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయడానికే కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేశామనీ తెలిపారు.రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే విక్రయించుకొని మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెల్ల నర్సింగం గౌడ్, డైరెక్టర్లు, తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఉపాద్యక్షులు గుగ్గిల్లా శ్రీకాంత్ గౌడ్,సిరిసిల్ల అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షుడు గుగ్గిల్లా అభినయ్ గౌడ్,కాంగ్రెస్ నాయకులు కోదాడి మల్లేష్ బాబు, సిలివేరి యెల్లయ్య, కొక్కిరాల సూర్య రావు,కోదాడి అంజయ్య, మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు..