
– కన్నెత్తి చూడని రెవెన్యూశాఖ అధికారులు
నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
పెద్దకొడప్ గల్ మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలకే కాకుండా సంగారెడ్డి జిల్లా తడ్కల మండలానికి అక్రమ ఇసుక తరలింపు జోరుగ కొనసాగుతుంది.బిచ్కుంద మండలంలోని హస్గుల్,పుల్కల్, తదితర మంజీర పరివాహ ప్రాంతాల నుండి అక్రమంగా ఇసుక రవాణా చేపడుతున్నారు. కానీ అటు వైపుగా రెవెన్యూ శాఖ గాని , పోలీసు అధికారులు దృష్టి సారించకపోవడంతో అక్రమాదారులు తమదైన శైలిలో అక్రమ దందాను కొనసాగిస్తున్నారు. దీనికి తోడు అధికారులకు ఆమ్యామ్యాలు అందుతుండడంతో వీరి వ్యాపారం మూడు టిప్పర్లు, ఆర్టు ట్రాక్టర్లుగా మారుతోంది. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది కొంత కాలంగా ప్రభుత్వ అనుమతితో ఇసుక రవాణా జరిగినా ప్రస్తుతం అనుమతులు లేకుండానే అధికారులకు మాముళ్లు అందజేస్తూ తమ వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఈ తంతు అంతా అధికారులకు తెలిసే జరుగుతుందని అనుమానాలకు తావిస్తోంది. రాత్రి వేళల్లో ఇసుక రవాణా జరుగుతున్నప్పటికీ స్థానిక పోలీసులు ఇసుక ట్రాక్టర్లను ఆపి ప్రశ్నించి అడగ్గా ట్రాక్టర్ డ్రైవర్లు చరవాణిలో మాట్లాడివ్వడంతో పోలీసులు ఆ వాహనాలను వదిలిపెడుతున్నారు. ఆ చరవానిలో మాట్లాడింది ప్రజా ప్రతినిధుల లేక పోలీస్ అధికారుల అనేది తెలియాల్సి ఉంది. పోలీసుల అక్రమాలను అరికట్టాల్సింది పోయి అక్రమ ఇసుక రవాణా చేస్తున్న దళారులకు కొమ్ము కాయడంతో దళారులు రెచ్చిపోయి నాలుగు వేల రూపాయలకు రావాల్సిన ఇసుకను ఐదు నుంచి ఆరువేల రూపాయలకు విక్రయిస్తున్నారు.ఇసుక రవాణా అధికారుల చేతి వాటం వల్లే ఇదంతా జరుగుతుందని పలువురు జనాలు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులకు వారికి కావాల్సిన ముడుపులు చెల్లడంతో ఈ తంతు మధ్యాహ్నం సమయంలో కూడా యదేచ్చగా నడుస్తుందని పలువురు ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇసుక దళారులు మాత్రం రాత్రి పగలు అని తేడా లేకుండా ఇష్ట రాజ్యాంగ ఇసుక రవాణా చేపట్టడం శోచనీయమని మండల కేంద్రంలో ఉన్న పోలీస్ స్టేషన్ ముందు నుండే ఇసుక రవాణా జరుగుతున్న స్థానిక పోలీసులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వివరించడం గమనార్హం. ప్రభుత్వ ఆదాయాలకు గండి కొడుతూ ప్రభుత్వ అధికారులు జేబులు నింపుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.సంబంధిత అధికారులు అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని లేకపోతే అధికారుల జేబులు నింపుకొని ప్రభుత్వ ఖజానాన్ని గండి కొట్టడంతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం శూన్యం అవుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ఇసుక మాఫియాని అరికట్టడానికి సంబంధిత అధికారులు మామూలు మత్తులో దిగకుండా వారి వృత్తికి న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు.అంతేకాకుండ జగన్నాథ్ పల్లి నుండి పోచారం వెళ్లే రోడ్డు మార్గంలో కూడా రాత్రి సమయంలో ట్రాక్టర్ల ద్వారా ఇసుక అక్రమంగా తరలిస్తున్న వైన్యం.ఇంత అక్రమ ఇసుక రవాణా తంతు జరుగుతున్న సంబంధిత పోలీసు మరియు రెవెన్యూశాఖ అధికారులకు తెలియకుండా జరుగుతుందా అంటే పప్పులో కాలువేసేనట్లే అని జనాలు ఆరోపిస్తున్నారు. అక్రమాలు జరుగుతే మాకేం మాములు వస్తే చాలు అనే ధోరణిలో ఉన్నారని చెప్పవచ్చు.