Thursday, May 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బండి భగీరథ్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలి 

బండి భగీరథ్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలి 

- Advertisement -

– డిటీఎఫ్ నేత విజయరామరాజు 
 నవతెలంగాణ – కామారెడ్డి

మైనర్ బాలికపై లైంగికదాడి ఆరోపణల కేసులో బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్  కుమార్ తన ఎంపీ పదవికి రాజీనామా చేసి విచారణను ఎదుర్కోవాలని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డిటీఎఫ్) రాష్ట్ర కౌన్సిలర్, పెన్షన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విజయరామరాజు డిమాండ్ చేశారు.

ఈ మేరకు గురువారం విడుదల చేసిన ఒక  ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. మైనర్ బాలిక తల్లిదండ్రులు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ, వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. బాధితురాలిపైనే తిరిగి కేసులు నమోదు చేయడం దుర్మార్గమని విమర్శించారు. పోలీస్ శాఖలో నిజాయితీగా పనిచేస్తున్న సిబ్బంది ఉన్నప్పటికీ, కొందరు ఉన్నతాధికారుల వైఖరి వల్ల మొత్తం శాఖ ప్రతిష్ట దెబ్బతింటోందని అన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకుండా పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ తన ప్రభావాన్ని ఉపయోగించి తన కుమారుడిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన విజయరామరాజు, ఒక సామాన్యుడిపై ఇలాంటి ఆరోపణలు వచ్చినట్లయితే వెంటనే చర్యలు తీసుకునేవారని పేర్కొన్నారు.

మహిళల భద్రత, “బేటీ బచావో – బేటీ పడావో” నినాదాలకు నిజమైన గౌరవం ఉంటే, బండి సంజయ్ ముందుకు వచ్చి విచారణకు సహకరించాలని డిమాండ్ చేశారు. బండి భగీరథ్ నిర్దోషి అయితే కోర్టులో తన వాదనలు వినిపించుకుని బయటపడాలని, బాధితురాలిపై ఒత్తిడి తేవడం సరికాదన్నారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం స్పందించి, బండి సంజయ్‌ను కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర  మోడీ,  కేంద్ర హోంమంత్రి అమిత్  షా లను కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్  రేడ్డి  ఈ విషయంలో జోక్యం చేసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయ నాయకులు తమ పిల్లలకు నైతిక విలువలు, సమాజపట్ల బాధ్యత నేర్పించాలని విజయరామరాజు ఆ ప్రకటన లొ  సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -