– విద్యాలయాల్లో వసతుల పరిశీలన
– భోజనం,పారిశుధ్యం,ఆరోగ్యం వివరాలపై ఆరా
నవతెలంగాణ – బెజ్జంకి
విద్యాలయాల్లో భోజనం,పారిశుధ్యం,అనారోగ్య సమస్యలకు అయా సంబంధిత అధికారులు చోరవ చూపి తక్షణం పరిష్కారిస్తారని విద్యార్థులు తమ సమస్యలను తహసిల్దార్,ఎంపీడీఓ,వైద్యారోగ్య శాఖల దృష్టికి తీసుకురావాలని తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి సూచించారు.శనివారం మండల కేంద్రంలోని కేజీబీవీ,ఆదర్శ విద్యాలయాలను కలెక్టర్ అదేశానుసారం త్రీ మ్యాన్ కమిటీ బృందం(తహసిల్దార్,ఎంపీడీఓ,వైద్యాధికార) సందర్శించి క్షత్ర స్థాయిలో పరిశీలించారు.విద్యార్థుల వసతి,భోజనం, పారిశుధ్యంపై త్రీ మ్యాన్ కమిటీ బృందం క్షుణ్ణంగా పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు.విద్యాభోజన, వసతి,భోజనం,పారిశుధ్య నిర్వహణపై విద్యార్థులను,బోధన సిబ్బందితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.తరగతి గదుల్లో విద్యా బోధన,భోజనం అందించే విధానంపై కమిటీ బృందం వివరాలు సేకరించి భోజనం తయారు,కూరగాయలను పరిశీలించారు.బోధన సిబ్బంది తీరు,విద్యా బోధన తీరుపై విద్యార్థులతో మాట్లాడారు.అనంతరం అయా విద్యాలయాల్లో బోధన సిబ్బంది,విద్యార్థుల హాజరు రికార్డులను పరిశీలించారు.పంచాయతీ కార్యదర్శి ప్రనీత్ రెడ్డి,హేల్త్ సూపర్ వైజర్ సులోచన,ఆశా కార్యకర్తలు టీ.రజిత,రేణుకా,కేజీబీవీ ప్రత్యేకాధికారి శ్వేత పాల్గొన్నారు.
కేజీబీవీలో సమస్యల గుర్తింపు..
కేజీబీవీలో విద్యార్థినిలకు తరగతి గదుల్లోనే వసతి ఏర్పాటుచేయడంతో గదుల కొరతను గుర్తించినట్టు తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.కేజీబీవీ విద్యాలయం వెనుకభాగంలో వర్షపు నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని గ్రామంలోని వృథా మట్టితో పూడ్చి నీరు నిల్వ లేకుండా చర్యలు చేపడుతామని ఎంపీడీఓ ప్రవీన్ తెలిపారు.విద్యార్థులకు వైద్య సేవలు అందుబాటులో ఉన్న ఆస్పత్రిలోనే అందిస్తున్నామని ఇంచార్జీ వైద్యురాలు భాగ్యలక్ష్మి తెలిపారు.
జ్వరాల భారిన 20 మంది ఆదర్శ విద్యార్థులు..
ఆదర్శ విద్యాలయాన్ని త్రీ మ్యాన్ కమిటీ బృందం సందర్శించి వసతి గృహాన్ని,విద్యాలయాన్ని పరిశీలించారు.సుమారు 20 మంది విద్యార్థులు జ్వరాల బారిన పడి స్వగృహలకు వెళ్లినట్లు గుర్తించామని సోమవారం విద్యాలయంలో ప్రత్యేక వైద్య శిభిరం ఏర్పాటుచేసి పరీక్షలు నిర్వహించనున్నట్టు ఇంచార్జీ వైద్యురాలు భాగ్యలక్ష్మి తెలిపారు.అనంతరం పరిశుభ్రత,సీజనల్ వ్యాధుల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రధానాచార్యులు హర్జీత్ కౌర్,బాలయ్య,పీడీ కనుకారెడ్డి,బోధన సిబ్బంది,ఆరోగ్య కేంద్రం సీహెచ్ఓ సిద్ధప్ప,ఆశా కార్యకర్త రేణుకా పాల్గొన్నారు.