- Advertisement -
నవతెలంగాణ -టేకుమట్ల
మండలంలోని పోలీస్ స్టేషన్ లో ప్రతిష్టించిన వినాయకుడిని బుధవారం పోలీస్ సిబ్బంది నిమజ్జనం చేశారు. నిత్యం శాంతి భద్రతల పరిరక్షణలో తీరిక లేకుండా ఉండే పోలీసులు తమ విధులతో పాటు వినాయకుడికి తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో ఎస్సై అమూల్య తన సిబ్బందితో కలిసి గణనాథుడిని రాఘవరెడ్డిపేట చలివాగులో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో ఎస్సై అమూల్య, హెడ్ కానిస్టేబుల్ మల్లయ్య, కానిస్టేబుల్ మహేందర్, డ్రైవర్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



