– అభివృద్ధి పనుల శంకుస్థాపనలో ఎమ్మెల్యే కవ్వంపల్లి
– రూ.94.51 లక్షల అభివృద్ధి పనుల ప్రారంభం
– రూ.59.23 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
నవతెలంగాణ – బెజ్జంకి
గత ప్రభుత్వానికి దీటుగా అభివృద్ధి పనులకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రాముఖ్యతనిస్తుందని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో రూ.89.51 లక్షల నిధులతో నిర్మించిన గ్రామ పంచాయతీ దుకాణాల సముదాయము,ప్రాథమిక పాఠశాలలో నిర్మించిన ప్రహరీ గోడ,మూత్రశాలలు, బాలికల ప్రభుత్వోన్నత పాఠశాలలో భోజనశాలను ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ స్థానిక ప్రజాప్రతినిధులు,అధికారులు ఎంపీపీ నిర్మల,జెడ్పీటీసీ కడగండ్ల కవిత,సర్పంచ్ ద్యావనపల్లి మంజుల,ఎంపీటీసీ గుభిరే శారధ,ఉప సర్పంచ్ బండి వేణు యాదవ్,ఎంపీడీఓ దమ్మని రాము,ఎంపీఓ విష్ణు వర్దన్,పంచాయతీ రాజ్ ఏఈ సమ్మయ్య, రోడ్డు భవనాల శాఖ ఏఈలు సాధిక్,హరి ప్రసాద్ లతో కలిసి ప్రారంభోత్సవం చేశారు.మిషన్ కాకతీయలో భాగంగా రూ.30.22 లక్షల అంచనా నిధులతో చేపట్టనున్న ఊర చెరువు 2వ దఫా సుందరీకరణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.గత ప్రభుత్వంలో అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేసిన గుత్తేదారులకు బిల్లులు రాక తీవ్ర ఆందోళన చెందుతున్నారని వారి సమస్య పరిష్కారం కోసం సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు.అనంతరం గూడెం గ్రామంలో రూ.5 లక్షల జిమ్ నిర్మాణం, రూ.4 లక్షలతో నూతన ముధిరాజ్ సామూహిక భవనం,,రూ.20 లక్షలతో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే సర్పంచ్ దేవా రాజశ్రీ, అధికారులతో కలిసి శంకుస్థాపన చేసి యాదవ సంఘ సామూహిక భవనం,సీసీ రోడ్లను ప్రారంభించి పాఠశాలలో సరస్వతీ దేవి విగ్రహావిష్కరణ చేశారు.అంతకుముందు మండల కేంద్రంలోని మిని స్టేడియంలో జరుగుతున్న క్రికెట్ టోర్నీ పైనల్ మ్యాచ్ కు టాస్ వేసి మ్యాచ్ ను ప్రారంభించారు.ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన ఇంటర్ విద్యార్థుల వీడ్కోలు సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హజరై మాట్లాడారు.ప్రభుత్వ విద్యాలయాలను కాపోడుకోవాల్సిన బాధ్యత సమాజంలోని అందరిపైన ఉందని..ప్రభుత్వ విద్యపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందన్నారు.ఉన్నత స్థాయికి ఎదగడానికి ఇంటర్ విద్య ప్రాముఖ్యమైందని ప్రతి విద్యార్థి కష్టమనుకోకుండా ఇష్టపడి చదివితేనే ఉత్తమ పలితాలు సాదిస్తారన్నారు.విద్యార్థుల నడవడికపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.కాంగ్రెస్ నాయకులు ముక్కిస రత్నాకర్ రెడ్డి,ఒగ్గు దామోదర్,లింగాల శ్రీనివాస్,శానకొండ శ్రావణ్,మంకాల ప్రవీన్,రొడ్డ మల్లేశం,మానాల రవి,డీవీ రావు,మెట్ట నాగారాజు,జెల్లా ప్రభాకర్,బోనగం రాజేశం, మాజీ సర్పంచ్ రావుల నర్సయ్య,అయా గ్రామాల కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.
గత ప్రభుత్వానికి ధీటుగా అభివృద్దికి ప్రాముఖ్యత
పంచాయతీ పాలకవర్గం సభ్యులకు వీడ్కోలు : గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యుల పదవీకాలం ముగుస్తున్న సందర్భంగా మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ భవనంలో పాలకవర్గం సభ్యులను ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ శాలువ కప్పి ఘనంగ సన్మానించి స్వీట్స్ తినిపించి ఘనంగా వీడ్కోలు పలికారు.పంచాయతీ పాలకవర్గం సభ్యులు ఎమ్మెల్యేను శాలువ కప్పి ఘనంగ సన్మానించారు.
ఎస్టీయూ అధ్వర్యంలో ఎమ్మెల్యేకు సన్మానం..మండల కేంద్రంలోని బాలుర ప్రభుత్వోన్నత పాఠశాల అవరణంలో ఎస్టీయూ,టీఎస్ యూటీఎఫ్,డీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘాల ఉపాధ్యాయులు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను మార్యాదపూర్వకంగా కలిసి శాలువ కప్పి ఘనంగ సన్మానించారు.ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను సత్వరం పరిష్కరించేల ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని ఉపాధ్యాయ సంఘాల కార్యవర్గ సభ్యులు వినతిపత్రమందజేశారు.కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీరాములు,ఎస్టీయూ జిల్లా ఆర్థిక కార్యదర్శి వడ్లకొండ శ్రీనివాస్, మండలాధ్యక్షుడు శంకరాచారి,ప్రధాన కార్యదర్శి రామంచ రవీందర్,డీసీసీ రాష్ట్ర కౌన్సిలర్ ప్రవీణ్ కుమార్,టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి గిరిబాబు, మండలాధ్యక్షుడు నర్సింహారెడ్డి,నాగయ్య,సతీష్ కుమార్ పాల్గొన్నారు.