డీవీఆర్‌ యాదిలో…

డీవీఆర్‌ యాదిలో...కామ్రేడ్‌ డీవీఆర్‌ కన్నుమూసి నేటికి నాలు గేండ్లు. ఆయన ప్రజా, ఉపాధ్యాయ ఉద్యమాలకు పె ట్టింది పేరు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో డీవీ ఆర్‌ అంటే తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. వృత్తి ఉపాధ్యాయుడే అయినా ఆయన ప్రవృత్తి మాత్రం కమ్యూనిజం. సమాజం మారకుండా విద్యా వ్యవస్థ మారదని, సమాజాన్ని మార్చుటకు ఉత్పత్తికి అవసరమయ్యే ప్రకృతి, పనిముట్లు, మానవశ్రమకు తోడ్పడతాయని నమ్మి ఆచరించే మార్క్సిస్టు ఉద్యమా న్ని ఎన్నుకుని జీవితాంతం పనిచేసిన ఆదర్శమూర్తి.
ఆయన పుట్టింది నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి మండలం మార్చాల. పూర్తి పేరు దేశం వెంకట్‌రెడ్డి. కానీ ఉద్యమ సహచరులంతా డీవిఆర్‌గా పిలుచుకునే వారు. ఆయన జడ్‌పిహెచ్‌ఎస్‌ పొల్కంపల్లిలో ప్రధానో పాధ్యాయుడిగా పనిచేశారు. కు టుంబంతో సహా అదే గ్రామంలో నివాసముంటూ ప్రతిరోజూ అక్క డి హాస్టల్‌ను సందర్శించి చదు వులో విద్యార్థులను ప్రోత్సహించే వారు. హాస్టల్‌ సమస్యల పరిష్కారానికి విద్యార్థి ఉద్య మాన్ని నిర్మించారు. ప్రధానోపాధ్యాయుడుగా ఉండి మహబూబ్‌నగర్‌ జిల్లాలో తాను పనిచేసిన గ్రామాల్లో ఉద్యోగ ధర్మంతో పాటు మార్క్సిజం విత్తనాలను చల్లి మొలకెత్తేటట్లు చేసిన ఘనత ఆయనదే. పొల్కంపల్లి, మాదారం, కల్వకుర్తి, నారాయణపేట, రాజోళి, తూం కుంట, రఘుపతిపేట, వంగూరు తదితర ఉన్నత పాఠ శాలల్లో పనిచేసి 1989లో ఉద్యోగ స్వచ్ఛంద విరమణ చేశారు. అనంతరం పూర్తికాలం కమ్యూనిస్టు కార్యకర్త గా జిల్లా పార్టీ సభ్యుడుగా ఉండి పేదల కోసం అనేక గ్రామాల్లో భూ పోరాటాలు నిర్వహించారు. నిరుపేద లకు భూములు పంచి ప్రాంతంలో పేదప్రజలకు సన్ని హితుడయ్యాడు.
జిల్లాలో వివిధ ప్రాంతాలలో జరిగిన భూపోరా టాల ఉత్తేజంతో కల్వకుర్తి డివిజన్‌లో వివిధ గ్రామాల్లో పోరాటాలు జరిగాయి. పార్టీ రాష్ట్ర నాయకులు పి.మధు, భీంరెడ్డి నర్సింహ్మారెడ్డి, క్రిష్ణమూర్తి, జిల్లా కార్యదర్శి వనగంటి ఈశ్వర్‌, జిల్లా నాయకులు ఆర్‌.రాంరెడ్డి, కిల్లెగోపాల్‌, ఎ.రాములు, యం. యాదయ్య ఈ పోరాటాల్లో భాగస్వాముల య్యారు. పోతారెడ్డిపల్లి గ్రామంలో ఒక భూస్వామి ఆ దీనంలో ఉన్న ప్రభుత్వ గైర్హాన్‌ భూమి పదహారెకరాలు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పోరాడి ముప్తై రెండు మంది కి పంచారు. కిలోమీటర్‌ దూరంలో ఉన్న దుందుబినది నుండి ఎస్‌సి కార్పోరేషన్‌ ద్వారా రెండు లక్షల రూపా యల ఖర్చుతో పైప్‌లైన్‌ ద్వారా నీరు పంటకు అందిం చిన ఘనత పార్టీకి దక్కింది. ఈ ప్రభావం వంగూర్‌ మండలంలోని చౌదర్‌పల్లి, రంగాపూర్‌, కోనాపూర్‌, పొల్కంపల్లి, చింతపల్లి, వెంకటాపురం, సదగోడు, జా జాల గ్రామాలలో పార్టీశాఖలు ఏర్పడి భూపోరాటాలు జరగడానికి డీవిఆర్‌ ప్రధాన భూమిక.
రాష్ట్ర ప్రజానాట్య మండలి బృందం ఆధ్వర్యంలో సీతారామరాజు బుర్రకథ ఎనిమిది గ్రామాల్లో ప్రదర్శిం చి ప్రజలను ఉత్తేజపరిచింది. ఈ స్పూర్తితో గట్టిప్పల్ల పల్లిలో రెండు నెలలపాటు పాలేరులు, కూలీల సమ్మె జరిగింది. భూస్వాములు వారి భూములు వారే సాగు చేసుకుని సమ్మెను బలహీనపర్చడానికి ప్రయత్నం చే శారు. సమ్మెకు మద్దతుగా వివిధ వృత్తులవారు భూ స్వాముల పనులు చేయకుండా ఆపివేయడంతో దిగివచ్చి జీతాలు, కూలి పెంచక తప్పలేదు. డీవిఆర్‌ పోరాట స్పూర్తితో తలకొండపల్లి మండలంలో అనేక గ్రామాలతో పాటు ఇతర మండల, గ్రామాలు వెల్‌ జాల, చౌదరపల్లి, చీపునుంతల, ఉప్పలపహాడ్‌, రాచూ రు, మాదాపల్లి, సెట్టిపల్లి, బ్రహ్మణ పల్లి, నాగిళ్ళ, వెం కట్‌రావుపేట, మార్చాల, రాచాలపల్లి, రాచూర్‌లో భూ పోరాటాలు జరిగాయి. ఈ పోరాటాల ఫలితంగా 30 గ్రామాల్లో సుమారు పన్నెండు వందల ఎకరాల భూమి పేదలకు దక్కింది.
డీవిఆర్‌ జీవితం ప్రధానంగా రెండు పార్శ్వాలుగా కనిపిస్తాయి. ఒకటి ఉపాధ్యాయుడుగా, సంఘ నాయ కుడిగా విద్యావ్యవస్థ మార్పుకోసం పోరాటం. రెండు కమ్యూనిస్టుగా సమాజ మార్పు కోసం, ఆచరణ- పోరాటాలు కనిపిస్తాయి. ఉపాధ్యాయ ఉద్యమ నాయ కుడు ఆర్‌ రాంరెడ్డి ద్వారా ఎన్నో ఉద్యమాలు నిర్వ హించి చివరివరకూ అంకితభావంతోనే పనిచేశారు. ”విప్లవ కార్యాచరణ లేకుండా విప్లవ కారుడిగా జీవిం చలేవు” అన్నట్టు ప్రజాసంఘం లేదా పార్టీ నిర్మాణం కోసం మనం ఎంతో పని చేస్తున్నాం అనేది సొంతంగా విప్లవకారుడు పరిశీలించుకోవడానికి డీవిఆర్‌ చక్కటి ఉదాహరణ. తాను మరణించేవరకు ఎర్రజెండా వదులుకోలేదు. తనతో పాటు భార్య విజయలక్ష్మీ, కుటుంబ సభ్యులను కూడా పార్టీ, ప్రజాసంఘాలలో పని చేయించారు.
నేడు భారత రాజ్యాంగ విలువలైన, లౌకిక ప్రజా స్వామ్యం, మతసామరస్యం, ఆర్థిక సార్వ భౌమాధి కారం, సామాజిక న్యాయం, ఫెడరలిజాన్ని నాశనం చేయుటకు కేంద్రంలోని బీజేపీ పూనుకుంది. మతం సెంటిమెంట్‌తో, భావోధ్వేగాలను రెచ్చగొట్టి, హిందూ, ఇతర మైనార్టీల మధ్య తగాదా సృష్టిస్తోంది. సనాతన ధర్మం పేరు మీద చాతుర్వర్ణ వ్యవస్థతో కూడిన హిందూత్వ రాజ్యాన్ని స్థాపించుటకు ప్రయ్నతం చేస్తోంది. ప్రశ్నించే శక్తులను అణిచివేస్తోంది. బీజేపీ ప్రేరేపిస్తున్న ఈ మతోన్మాదాన్ని తిప్పికొట్టి, లౌకిక శక్తులు ఐక్యమత్యంతో పోరాడి భారతదేశ రాజ్యాం గాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించడమే డీవిఆర్‌ లాంటి నాయకులకు అందించే నిజమైన నివాళి.
(నేడు డీవీఆర్‌ నాలుగో వర్థంతి)
– ఎ పి మల్లయ్య, 9440595421

Spread the love