
నవతెలంగాణ – మల్హర్ రావు
కాంగ్రెస్ నాయకులు పుదరి సర్వేశ్ గౌడ్ ఆధ్వర్యంలో ముత్తారంలోని (మంథని) సింగిల్ విండో డైరెక్టర్లు బుధవారం తెలంగాణ ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. మంత్రి వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో గుజ్జా గోపాల్ రావు ( ముత్తారం), ఏలువాక కొమురయ్య ( ఆదివారం పేట) నాయిని పార్వతి (పారుపల్లి) బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లో పార్టీలో చేరారు.